ప్రజాశక్తి పార్వతీపురంరూరల్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తూ ప్రతిపక్ష నేతను అక్రమ కేసుల్లో అరెస్టు చేయడాన్ని జీర్ణించుకోలేని ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గరపడ్డాయని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం టిడిపి పార్వతీపురం నియోజకవర్గం ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులతో కలిసి అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి ప్రభుత్వాన్ని నిలువరించేందుకు టిడిపితో జనసేన కలిసి రావడాని తాము స్వాగతిస్తున్నామని, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ప్రజాస్వామ్యక వాదులంతా కలిసికట్టుగా ఈ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకట నాయుడు, ఎఎంసి మాజీ చైర్మన్ రెడ్డి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు కోరాడ నారాయణరావు, బడే గౌరినాయుడు, టి.వెంకటరావు, కోలా సరిత, మధుసూదనరావు, నాయకులు బార్నాల సీతారామారావు, బోను చంద్రమౌళి, గురజాన చంద్రమౌళి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కురుపాం : ప్రభుత్వ అవినీతి, అరాచకత్వంపై ప్రశ్నిస్తున్నందుకే ప్రతిపక్ష నేతలపై కక్షతోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అన్యాయంగా అరెస్టు చేశారని కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి టి.జగదీశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ స్థానిక టిడిపి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆమె ప్రారంభించారు. ఈ దీక్షలకు సంఘీభావంగా జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్లు కెవి కొండయ్య, శేఖర్ పాత్రుడు, అక్కేన మధు, పాడి సుధా, పల్ల రాంబాబు, టిడిపి నాయకులు డొంకాడ రామకృష్ణ, కోలా రంజిత్ కుమార్, కిమిడి రామరాజు, రంజిత్ కుమార్ నాయక్, నందివాడ కష్ణబాబు, జనసేన నాయకులు ఎన్. వంశీ, జి. గౌరీ, ఐదు మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మక్కువ : టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ మండలంలో టిడిపి నాయకులు దీక్షలు చేశారు. మక్కువలో జరిగిన దీక్షలకు నాయకులు మావుడి ప్రసాదరావునాయుడు, మండల పార్టీ అధ్యక్షులు గొల్ల వేణుగోపాలరావు నాయకత్వం వహించగా, ఎ.వెంకంపేటలో మాజీ టిడిపి అధ్యక్షులు పెంట తిరుపతిరావు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు తీళ్ల పోలినాయుడు, చొక్కాపు బుచ్చినాయుడు, చింతల తవిటి నాయుడు, బుడిశెట్టి గౌరీశంకర్, మింది సింహాచలం, వెంపడాపు స్వామినాయుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కష్టకాలంలోనూ వేర్వేరుగా దీక్షలు చేయడం మక్కువలో టిడిపి నాయకుల తీరు చూసి పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు: కొమరాడ: మండల కేంద్రంలో చేపడుతున్న రిలే దీక్షలు మూడవ రోజు కొనసాగాయి. కార్యక్రమంలో టిడిపి అరుకు పార్లమెంట్ ఎస్‌టిసెల్ ప్రధాన కార్యదర్శి బిడ్డక తమ్మయ్య, మరడాన వెంకటనాయుడు, జి.వెంకటనాయుడు, కేతిరెడ్డి అచ్యుత్ రావు, రాజాను రాము, జనసేన నాయకులు పల్లి శ్రీకాంత్, కశిణ బోయిన చంటి తదితరులు పాల్గొన్నారు. పాలకొండ రూరల్: టిడిపి నియోజక వర్గ ఇంచార్జ్ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గురువారం రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. జయకృష్ణకు పాతపట్నం నియోజకవర్గం నాయకులు కలమట సాగర్ సంఘీభావం తెలిపారు. ఈ నిరసనలో పట్టణ అధ్యక్షుడు గంటా సంతోష్ కుమార్, మండల అధ్యక్షుడు గండి రామినాయుడు, కోట దేవా సంగంనాయుడు, కిమిడి కాశీంనాయుడు, వెన్నపు శ్రీనివాసరావు, ఆడపా బాబాజీ నాయుడు, వరహాల నాయుడు పాల్గొన్నారు. పాలకొండ: టిడిపిలో ఒక వర్గం గురువారం ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద దీక్షా శిబిరం చేపట్టారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో మధ్యలో దీక్షలను విరమించారు. ఈ కార్యక్రమంలో ఖండాపు వెంకటరమణ, సామంతుల దామోదరరావు, వారాడ సుమంత్‌నాయుడు, గుమ్మిడి సింహాద్రి, పడాల భూదేవి, వావిలపల్లి రమణమూర్తి తదితరులున్నారు.
నేడు రిలే నిరాహారదీక్షలు
గరుగుబిల్లి : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ చంద్రబాబుకు తోడుగా మేము సైతం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని టిడిపి మండల అధ్యక్షులు అక్కేన మధుసూదనరావు వెల్లడించారు. ఈ దీక్షల్లో మాజీ మంత్రి శత్రు చర్ల విజయరామరాజు, కురుపాం నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ దీక్షలకు నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జీలు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
టిడిపి దీక్షలు భగం
సాలూరు : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా గురువారం టిడిపి నాయకులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పట్టణంలోని బోసు బొమ్మ జంక్షన్‌లో చేపట్టిన దీక్షా శిబిరాన్ని టౌన్ సిఐ సిహెచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యాన పోలీసులు భగం చేశారు. నియోజకవర్గ ఇంఛార్జి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్ దేవ్ లేకుండానే పట్టణ పార్టీ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు ఆధ్వర్యాన రిలే దీక్షలకు ప్రయత్నించారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు బి.అశోక్, మండల నాయకులు భాస్కరరావు ఉన్నారు.










