Sep 16,2023 21:19

బొండపల్లి: ఆర్‌బికెను ప్రారంభిస్తున్న ఎంపి, ఎమ్మెల్యే

ప్రజాశక్తి- బొండపల్లి : ప్రజలు మరోసారి ఆశీర్వదించి జగన్మోహన రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కోరారు. వెదురవాడ గ్రామంలో శనివారం సచివాలయ భవనం, కొత్తపాలెంలో రైతు భరోసా కేంద్రం, వెల్నెస్‌ సెంటర్‌ను ఎంపి, ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కొత్తపాలెం, చీడిపాలెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలు సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. నాలుగేళ్లలో జగనన్న ప్రభుత్వం సంక్షేమానికి పేదపీట వేసిందన్నారు. ప్రతి కుటుంబాన్ని ఆర్ధికంగా చేయూతను ఇవ్వాలని సంకల్పంతో వైసిపి ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం పరి తపిస్తున్న వైయస్‌ జగనమోహన్‌ రెడ్డిని మరోసారి ముఖమంత్రి చేయాలని ప్రజలను కోరారు. ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలని, మంచి, చెడులను బేరీజు వేయాలని ఆయన కోరారు. ప్రతిపక్ష టిడిపి నాయకుల కల్లబొల్లి మాటలను నమ్మ వద్దని వాస్తవాన్ని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చల్ల చలం నాయుడు, జెడ్పిటిసి రాపాక సూర్యప్రకాశరావు, ఎఎంసి చైర్మన్‌ వేమలి ముత్యాలనాయుడు, మండల ప్రత్యేకాధికారి దుర్గాప్రసాద్‌, తహశీల్దార్‌ ప్రసాద్‌ రావు, ఎంపిడిఒ వైబి.రాజేంద్ర ప్రసాద్‌, ఇఒపిఆర్‌డి సుగుణాకర్‌ రావు, వైస్‌ ఎంపిపిలు మీసాల సరోజిని, గొండెల ఈశ్వర రావు, వైసిపి మండల అద్యక్షులు బొద్దల చిన్నంనాయుడు, గొట్లాం, రాచకిండాం పిఎసియస్‌ అద్యక్షులు మహంతి రమణ, గొల్లు సతీష్‌, ఎపిఒ బి.కృష్ణవేణి, ఎపిఎం సులోచనా దేవి, ఎఒ మల్లికార్జున రావు, సిఎస్‌డిటి రవిశేఖర్‌, కొత్తపాలెం, మరువాడ కొత్తవలస, వెండ్రాం, ముద్దూరు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చేతులమీదుగా ఆర్ధిక సహాయం
మండలంలోని బిల్లలవలస గ్రామానికి చెందిన పత్తిగుల్ల ఆది అప్పలనాయుడుకు శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.60వేలు నగదును ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అందచేశారు. ఆది అప్పలనాయుడు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని తెలుసుకుని ఈ సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్‌ వేమలి ముత్యాలునాయుడు, నారాయణమూర్తిరాజు, సుంకరి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
గరివిడి: చీపురుపల్లి పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌ శనివారం ప్రారంభించారు. పట్టణం, పిల్లపేటలో స్మశాన వాటికలో రూ.5 లక్షలతో నిర్మించిన వాటర్‌ ట్యాంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ నిధులతో వాటర్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేశామని, పిల్లపేటలో సులభ కాంప్లెక్స్‌ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ. 4లక్షలు, ఎంపి నిధులు రూ.8లక్షలతో కూరాకుల వీధిలో సులభ కాంప్లెక్స్‌ చుట్టూ ప్రహరీ గోడ, లోపల ఫ్లోరింగ్‌, కాలువను ఎంపిపి నిధులతో నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, సర్పంచ్‌ మంగళగిరి సుధారాణి, శ్రీను, పతివాడ రాజారావు, బెల్లాన వంశీకృష్ణ, ఇప్పిలి సూర్యప్రకాష్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సతివాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.