ప్రజాశక్తి - మంత్రాలయం
చంద్రబాబు నాయుడు పాలనను ప్రజలు మళ్లీ మళ్లీ కోరుకుంటున్నారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. గురువారం చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి ఆధ్వర్యంలో స్థానిక రాఘవేంద్ర సర్కిల్‌లో బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి శూన్యమని, ఆయన వల్ల ఖజానా ఖాళీ అయిందని తెలిపారు. రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేశారని విమర్శించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లో చైతన్యం వచ్చిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. నియోజకవర్గం నుంచి కూడా ఈ సారి గెలిచి అసెంబ్లీకి వెళ్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపి మండల నాయకులు బూదూరు మల్లికార్జున రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, కృష్ణ మనోహర్ రెడ్డి, చావిడి వెంకటేష్, వట్టేప్ప గారి నరసింహ, మేకల నరసింహ పాల్గొన్నారు. గోనెగండ్లలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. టిడిపి కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. నాయకులు బేతాళ బడేసా, ఎన్‌వి.రామాంజనేయులు, శ్రీధర్ నాయుడు, రంగస్వామి నాయుడు, మదీనా, నూర్ అహ్మద్, కొత్తింటి ఫక్రుద్దీన్, లక్ష్మీకాంత్, మల్దకల్, రహమతుల్లా, రంజాన్ పాల్గొన్నారు. కోసిగి (రూరల్)లోని శ్రీరేణుక ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో టిడిపి మండల కన్వీనర్ జ్ఞానేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు పాలకుర్తి సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. టిడిపి నాయకులు నాడిగేని అయ్యన్న, పెండ్యాల భరద్వాజ శెట్టి, కృష్ణా రెడ్డి, చిన్న బొంపల్లి నర్సింహులు, వీరారెడ్డి, ఎంపిటిసి రాజు, బెళగల్ రామయ్య పాల్గొన్నారు.
మాట్లాడుతున్న టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ తిక్కారెడ్డి










