
మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం:రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు 2.25 లక్షల కోట్ల ఖర్చు చేయడం జరిగిందని ఎక్కడ కూడా రాజీపడకుండా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని రేబాలలో ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి మళ్లీ సిఎం కావాలని కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్న వాటిని జీర్ణించుకోలేక పచ్చ బ్యాచ్ పగటి వేషధారణ ధరించి గ్రామాల్లో సంచరిస్తున్నా రన్నారు. కార్యక్రమంలో యర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి, చెర్లో సతీష్ రెడ్డి, చీరల ప్రసాద్, యానాది రెడ్డి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.