
మాట్లాడుతున్న చిరంజీవి
ప్రజాశక్తి-రోలుగుంట:కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని రోలుగుంట మండల సిపిఎం నాయకులు ఈరెల్లి చిరంజీవి డిమాండ్ చేశారు. రోలుగుంట మండలం సిపిఎం ఆధ్వర్యంలో శనివారం రోలుగుంట మండలం రత్నంపేట, కొంతలం గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రజలపై అనేక భారాలు పెరుగు తున్నాయన్నారు. నిత్యావసర ధరలు, గ్యాస్, కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపారన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని, పెరిగిన ధరలను తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.