Nov 10,2023 23:49

మంగళగిరి సిపిఎం కార్యాలయంలో మాట్లాడుతున్న పిన్నమనేని మురళీకృష

మంగళగిరి: సిపిఎం ప్రజారక్షణ భేరీ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీన విజయ వాడ లో జరిగే బహిరంగ సభకు మంగళగిరి ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని సిపిఎం రాష్ట్ర కమిటీ నాయ కులు పిన్నమనేని మురళీకష్ణ పిలుపు నిచ్చారు. శుక్రవారం రాత్రి మంగళగిరి సిపిఎం కార్యాలయంలో జరిగిన సమా వేశంలో పాల్గొని ప్రసంగించారు. దేశానికి, రాష్ట్రానికి నష్టం కలిగించే ఆర్థిక విధా నాలను అవలంబిస్తున్న బిజెపిని ఒంటరి చేసి రానున్న ఎన్నికల్లో ఓడించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభు త్వం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడకపోగా, వైసిపి ప్రభుత్వం అండతో అనేక రూపాలలో ప్రజ లపై భారాలు వేసిందని విమర్శించారు. అందులో భాగంగానే కరెంటు చార్జీలు పెరుగుదల, చెత్త పన్ను వేయడం, ఇంటి పన్ను పెంచడం వంటి చర్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తీసుకున్నా రని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు సిపిఎం ప్రత్యామ్నాయ విధా నాలను ప్రజలకు తెలియజేసేందుకు జరుగు తున్న సభకు ప్రజలు తరలిర ావాలని అన్నారు. సమావేశంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌ ఎస్‌ చెంగయ్య, సిపిఎం సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, పి.బాలకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వివి జవహర్‌లాల్‌, ఎం.బాలాజి పాల్గొన్నారు.
తాడేపల్లి రూరల్‌: ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న మతోన్మాద బిజెపిని వ్యతిరేకించా లని సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లిలో సిపిఎం నాయకులతో కలిసి ఆయన కర పత్రాలు పంపిణీ చేస్తూ, విస్తృత ప్రచారం నిర్వహించారు. సిపిఎం కుంచనపల్లి శాఖ కార్యదర్శులు ఎ.రంగా రావు, కె.వెంకటేశ్వర రావు, సిపిఎం నాయ కులు ఎ.రామారావు, ఎన్‌.బాబురావు, ఎ. సుబ్బారావు, ఎ. కైదుల రావు పాల్గొన్నారు. వడ్డేశ్వరంలో ప్రజా రక్షణభేరి ప్రచార కార్యక్రమాన్ని నిర్వ హిం చారు. ప్రధాన రహదారులలో కర పత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్న శివ శంకరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలకు వ్యతిరేకంగా అసమానతలు లేని అభివృద్ధి జరగాలని అన్నారు. ప్రచార కార్య క్రమం లో సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి దొంతి రెడ్డి వెంకటరెడ్డి, సిపిఎం సీనియర్‌ నాయకులు వడ్డేశ్వరం బిక్షాలు, వడ్డేశ్వరం కోటేశ్వరరావు, సిపిఎం గ్రామ శాఖ కార్య దర్శి వడ్డేశ్వరం పున్నయ్య, గుడిసె ప్రభు దాస్‌, లటికే కోటేశ్వరరావు, రాజు పాల్గొన్నారు
మేడికొండూరు: మేడికొండూరు, పేరేచర్ల గ్రామాల్లో ప్రజా రక్షణ బేరి సభ పై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యులు బైరవగానే శ్రీనివాసరావు,మండల కార్యదర్శి బొట్ల రామకృష్ణ పాల్గొన్నారు.