Sep 01,2023 19:52

ఎమ్మిగనూరులో వినతిపత్రం అందిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ప్రజలపై భారాలు వేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై 'సమరభేరి' నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.రామాంజనేయులు, జిల్లా నాయకులు గోవిందు తెలిపారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, అధిక ధరలు తగ్గించాలని శుక్రవారం సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు పట్టణంలోని 3, 4, 11, 12, 21, 26వ వార్డు సచివాలయాల కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేశారు. సచివాలయాల ఎదుట విద్యుత్‌ బిల్లులను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకు ప్రజలపై విపరీతమైన భారాలు వేయడం దారుణమని తెలిపారు. విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ అనుమతిని పక్కనపెట్టి ప్రతి యూనిట్‌పై 40 పైసల చొప్పున విద్యుత్‌ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. అలాగే రాబోయే కాలంలో విద్యుత్‌ చార్జీలు ప్రీపెయిడ్‌ రీచార్జీ పేరుతో వడ్డెన జరగనుందని తెలిపారు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో మరింత భారాలు ప్రజలపై పడనున్నాయని చెప్పారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని, రూ.400లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరారు. ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. చేనేత కార్మిక సంఘం నాయకులు కృష్ణ, లక్ష్మన్న, శ్రీధర్‌, భూషప్ప, వడ్డే నగేష్‌, పంపన్న, గోవిందు, రైతు సంఘం నాయకులు లక్ష్మీ నరసయ్య, వలీ, రాముడు, అబ్దుల్లా, రమేష్‌, సిఐటియు నాయకులు రాముడు, రాజు, డివైఎఫ్‌ఐ నాయకులు రవి పాల్గొన్నారు. ఆదోని (రూరల్‌) మండలంలోని ఢణాపురం, పెద్దహరివాణం, మదిరే, కుప్పగల్లు, పెద్దతుంబలం గ్రామాల్లో సచివాలయాల ముందు ఆందోళన చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె.వెంకటేశులు, మండల కార్యదర్శి కె.లింగన్న, మండల నాయకులు శేఖర్‌, చిన్న తిక్కన్న, తిక్కప్ప, హనుమంతు రెడ్డి, శాఖ కార్యదర్శులు ముత్తన్న, శ్రీనివాసులు, వెంకటేశులు పాల్గొన్నారు. నందవరం మండల కమిటీ ఆధ్వర్యంలో నాగలదిన్నె 1, 2, కనకవీడు, పొనకలదిన్నె, నందవరం సచివాలయ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సిపిఎం జిల్లా నాయకులు గురు శేఖర్‌, మండల నాయకులు ఎల్లేష్‌, నాగులదిన్నె శాఖ కార్యదర్శి రవి, నగేష్‌, సంతోష్‌, కొండన్న, కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు కె.రాజు, మండల నాయకులు నాగన్న, ఎపి రజక వృత్తిదారుల సంఘం నాయకులు గోవిందు, దేవపుత్ర, పొనకలదిన్నె శాఖ కార్యదర్శి పెద్దయ్య, నరసింహులు, ఈరన్న పాల్గొన్నారు. కోసిగి సచివాలయ సోషల్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ వీరేష్‌కు వినతిపత్రం అందజేశారు. సిపిఎం మండల కన్వీనర్‌ రాముడు, నాయకులు వీరేష్‌, రామకోటి, షిండే హనుమంతు, వెంకటేష్‌, కర్రెప్ప, గోపాల్‌, తాయన్న, ఆదెప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు. హాలహర్వి పంచాయతీ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు.