కడప అర్బన్ : ప్రజలను విభజించడానికే యుసిసి ప్రస్తావనను బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు తీసుకొచ్చిందని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం పాతబస్టాండ్ సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ అధ్యక్షతన 'యుసిసిని వ్యతిరేకించండి-దేశాన్ని రక్షించండి' అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ భారతదేశంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పారశీకుల అందరికీ ప్రత్యేక పర్సన్ లాలు భారత రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. 2018 జాతీయ లా కమిషన్ ఈ చట్టాలకు రాజ్యాంగ రక్షణ ఉందని ప్రకటించిందన్నారు. తమిళనాడులో 1967లో ప్రత్యేక హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చిందని చెప్పారు. నరేంద్ర మోడీ బిజెపి. ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మట్టిలో కలిపి ఆర్‌ఎస్‌ఎస్ హిందూత్వ అజెండాను అమలు చేసేందుకు కుట్ర పన్నుతోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హక్కుల చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు ఇచ్చిన 35-ఎ రాజ్యాంగ హక్కులను రద్దు చేయడం వంటి దుశ్చర్యకు పాల్పడిందని వాపోయారు. ఐదేళ్లుగా జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పరిపాలన సాగుతోందని, ఈశాన్య రాష్ట్రాల్లో మారణ హోమం జరుగుతోందని తెలిపారు. ఇది బిజెపి అశాస్త్రీయ నిర్ణయాల అమలులో భాగంగా వచ్చినవేనని, దీనికి ప్రధాని మోడీ బాధ్యత వహించాలని చెప్పారు. దేశంలో 'కామన్ క్రిమినల్ కోడ్' ఐపిసి, సిఆర్‌పిసి , ఎవిడెన్స్ యాక్ట్ ఉన్నాయని, ఇప్పుడు ప్రత్యేకంగా 'యూనిఫామ్ సివిల్ కోడ్' అవసరం లేదని వారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడి పని చేయాలని, కానీ బిజెపి రాజ్యాంగాన్ని పక్కనపెట్టి సొంత హిందుత్వ అజెండాను అమలు చేస్తోందని విమర్శించారు. ఇది రాజ్యాంగంలోని లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సోషలిజం లక్ష్యాలకు భిన్నంగా ఆశాస్త్రీయంగా ముందుకు పోతుందని చెప్పారు. బిజెపి అతివాదచ హిందుత్వ దుందుడుకు విధానాలను దేశ ప్రజలందరూ ఐక్యంగా ఎదుర్కోవాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాబుబారు, సంఘ సేవకులు సల్లావుద్దీన్ , మైనార్టీ హక్కుల నాయకులు దస్తగిరి, తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గం నాయకులు అమిర్ బాబు, లక్ష్మిరెడ్డి, నసీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.ఏ.సత్తార్, చార్లెస్, సిపిఐ. నాయకులు సావత్ సుధాకర్, సుబ్రహ్మణ్యం, భాగ్యమ్మ, బిఎస్‌పి జిల్లా అధ్యక్షులు గుర్రప్ప, లోక్‌సత్తా నాయకులు కష్ణ, సిపిఐ(ఎంఎల్) నాయకులు రమణయ్య, సిపిఎం కడప నగర కార్యదర్శి ఎ.రామ్మోహన్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఐఎన్ సుబ్బమ్మ, బి.మనోహర్, జిల్లా కమిటీ సభ్యులు వి.అన్వేష్, కె. శ్రీనివాసుల రెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, న్యాయవాది అమీన్ ప్రసంగించారు.
చంద్రబాబు, వై.ఎస్. జగన్, పవన్ తమ వైఖరి బహిరంగపరచాలి
కడప : యుసిసి ఫై చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ తమ వైఖరి బహిరంగపరచాలని ఎఐసిసిసభ్యులు బండి జకరయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో యుసిసి( యూనిఫాం కామన్ సివిల్ కోడ్ ) బిల్లును బిజెపి ప్రభుత్వం ప్రవేశపెడుతోంది, భిన్న జాతులు, భిన్న సంస్కతులు, భిన్న మతాలు, విభిన్నమైన ఆచార వ్యవహారాలు ఉన్న ఈ దేశంలో యు సి సి చట్టం అమలులోకి తేవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉందన్నారు.మాట్లాడుతున్న సిపిఎం జిల్లాకార్యదర్శి జి. చంద్రశేఖర్










