Sep 09,2023 22:21

ప్రజాశక్తి - గుడివాడ : బిజెపి ఢిల్లీలో సమరయోధుల స్మారక కేంద్రం నిర్మిస్తామని దేశవ్యాప్తంగా చిటికెడు మట్టిని సేకరించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆర్‌ సి పి రెడ్డి అన్నారు. గుడివాడ సిపిఎం పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమర యోధులను భావితరాలు స్మరించుకునేందుకు ఏర్పాటు చేస్తున్న స్మతి వనం చరిత్రలో నిలిచిపోతుందని బిజెపి నాయకులు పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి ద్రోహం చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలే బిజెపి అన్నారు. బిజెపి అబద్ధాలు చెప్పి ప్రజల్లో వైసమ్యాలు పెంచే పార్టీ ,సనాతన ధర్మం చేస్తున్న బిజెపి సతి సహగమనాన్ని ఆమోదిస్తుందా అని ప్రశ్నించారు. మహిళలు కించపరిచే విధానాన్ని బిజెపి అమలు చేస్తుందా బీజేపీ చెప్పే మాటలకు చేతలకు చాలా విద్వేషాలకు కారణమవుతున్నాయన్నారు. ఈ లౌకిక రాజ్యాంగాన్ని బిజెపి ఆమోదిస్తుందా అని ప్రశ్నించారు. బిజెపి ప్రజలను రెచ్చగొట్టే విధానాలని వెంటనే మాను కోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కార్యదర్శి పి రజిని పాల్గొన్నారు.