Jun 26,2023 01:10

సమావేశంలో మాట్లాడుతున్న పేరుబోయిన వెంకటేశ్వర్లు

చిలకలూరిపేట:'తొమ్మిదేళ్ల బిజెపి పాలన..బహిరంగ అధ్యయనం' అనే అంశంపై స్థానిక పండరీపురంలోని ఏలూరు సిద్దయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం ఆదివారం జరిగింది. ఈ వేదికకు సాతులూరి బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బహిరంగ అధ్యయన వేదిక కన్వీనర్‌ పేరు బోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఎస్‌ సార థ్యంలో బీజేపీ పాలనాపగ్గాలు చేపట్టిందసన్నారు. నాడు గుజరాత్‌ను చూపి ఆ మాదిరి అభివృద్ధిని చేస్తామన్న మోడీ దేశ ప్రజలను మోసం చేశారన్నారు. ప్రజలకు చెప్పిం దొకటి చేస్తోంది మరొకటి అని విమర్శించారు. విదేశాల నుంచి నల్లడబ్బు తెచ్చి ప్రజలకు పంచుతామన్న మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల కు ఒరి గిందేమిటని ప్రశ్నించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగా లు ఇప్పిస్తామని కనీసం సంవత్స రా నికి మూడు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేక పోయారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్నా వారే మాట తప్పారని, రాష్ట్ర విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పి ఏ ఒక్క హామీనీ అమలు చేయలేకపోయారని విమర్శించారు. కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్‌ కోడ్‌లను తీసుకురా వడం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో సహా ప్రభుత్వ రంగ పరి శ్రమల ప్రైవేటీకరణ, ఎల్‌ఐసిలో పెట్టుబడుల ఉప సంహరణ, రైతుల భూములను కార్పోరేట్‌ కంపెనీలకు ధారాధత్తం చేసేందుకు వ్యవసాయ చట్టాలు మా ర్పు చేయడం అన్యాయమన్నారు. మైనార్టీ పౌరసత్వ హక్కు లను రద్దు చేసి సిఎఎ, ఎన్‌ఆర్‌సి చట్టాలను తీసుకొచ్చా రన్నారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యా రం గంలో కార్పొరేటీకరణ, కాషాయీకరణ విధానాలు అవలం బిస్తున్నారన్నారు. విద్యుత్తు సవరణ బిల్లు ద్వారా విని యోగదారులపై వేస్తున్న భారం ప్రైవేటుకు అనుకూలంగా వున్నా యన్నారు. వ్యవసాయ పంప్‌ సెట్లకు మీటర్లు పెట్ట డం లాంటి రైతు వ్యతి రేక విధానాలకు పాల్పడ్డారన్నారు. ముఖ్యంగా రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏం.విల్సన్‌,సాంబిరెడ్డి బి. కోట నాయక్‌, రామ్మోహనం,ఎస్‌ కరిము ల్లా తదితరులు పాల్గొన్నారు.