Sep 04,2023 23:13

మాట్లాడుతున్న సత్యవతి

* డిసిసి అధ్యక్షులు సత్యవతి
ఆమదాలవలస :
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలను ఎన్నికలకు ముందు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2014లో కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రజా వ్యతిరేక విధానాలతో దేశం అల్లకల్లోలం అవుతోందని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయని, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయ,. ఇప్పుడు ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నందున కంటి తుడుపుగా 200 రూపాయల తగ్గించి గ్యాేస్‌ బండపై తగ్గించిౖ కపట ప్రేమ చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మణిపూర్‌ లాంటి రాష్ట్రాల్లో అక్కడి ఖనిజ సంపదని దోచిపెట్టడం కోసం వారిలో వారికే గొడవలు వచ్చేటట్టు చేసి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేశారని మండిపడ్డారు. పార్లమెంట్‌ లో మోడీ, షా అరాచకాలను ప్రశ్నిస్తున్నందున రాహుల్‌ గాంధీ పై అనర్హత వేటు వేశారని, అడిగిన వారిపై కేసులు పెట్టి దాడులు చేసి మానసికంగా కుంగదీసేట్లు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు రెళ్ల సురేష్‌, జిల్లా కార్యదర్శి లక్కినేని నారాయణరావు, బసవ షణ్ముఖరావు, లక్కినేని సాయిరాం తదితరులు పాల్గొన్నారు.