Jun 04,2023 22:28

ప్రజాశక్తి-ఏలేశ్వరం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కులమతాలకు అతీతంగా స్నేహబంధంతో మెలగాలని ఎస్‌పి ఎం.సతీష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ప్రత్తిపాడు మండలం పోతులూరులో ఆదివారం నిర్వహించిన వారధి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్న చిన్న విషయాలకు పంతాలకు పోయి తగాదాలకు దిగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కక్షలు పెరిగిపోతాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలు తీసుకోవడం సైబర్‌ నేరాలకు ఆకర్షితులయి సంఘ విద్రోహశక్తులుగా మారుతున్నారన్నారు. పిల్లలు వాటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండటం వల్ల ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించిన వారు అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డిఎస్‌పి కె.లతా కుమారి, సిఐ కె.కిషోర్‌ బాబు, ఎస్‌ఐ ఎం.పవన్‌ కుమార్‌ పాల్గొన్నారు.