Oct 25,2023 18:06

ప్రజాశక్తి - కైకలూరు
   ప్రజలందరూ పూర్తి ఆరోగ్యంగా ఉండటమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు తెలిపారు. ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలు గుర్తించి పరిష్కరించి, 14 రకాల వైద్య పరీక్షలతో పాటు, 172 రకాల మందులను అందుబాటులోకి తీసుకువచ్చి ఉచితంగా అందిస్తున్న ఘనత ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వేమవరప్పాడు గ్రామ సచివాలయ పరిధిలోని గ్రామ సచివాలయం నందు జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అన్నిరకాలుగా సేవలు అందిస్తున్న జగన్‌ను మరలా అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అడవి వెంకట కృష్ణ మోహన్‌, జెడ్‌పిటిసి కురేళ్ల బేబీ, మండల పార్టీ అధ్యక్షులు భట్రాజు శివాజీ, సర్పంచి నున్న రాంబాబు, ఉప సర్పంచి జాజుల రాజు, పిఎసిఎస్‌ అధ్యక్షులు బోడావుల శ్రీనివాసరావు, ఎఎన్‌ఎంలు, సిహెచ్‌ఒలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
   ఉంగుటూరు : నారాయణపురం సచివాలయం-1 పరిధిలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. డిప్యూటీ తహశీల్దారు బొడ్డేపల్లి దుర్గా ప్రసాద్‌ ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు సేవలందించారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఔషధాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఎన్‌.ప్రేమాన్విత, ఎంపిపి గంటా శ్రీలక్ష్మి, పంచాయతీ సభ్యులు అడపా శ్రీనివాసరావు, ఎంపిటిసి సభ్యుడు, మండల ఛాంబర్‌ అధ్యక్షుడు బండారు నాగరాజు, వైసిపి నాయకుడు బళ్ల త్రిమూర్తులు, వార్డు సభ్యులు, సచివాలయం కన్వీనర్లు సీపాని బాలు, మతుకుమిల్లి శ్రీథర్‌, పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.