Apr 07,2023 17:43

ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే కాటసాని మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి


ప్రజల్లోకి సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే
ప్రజాశక్తి - బనగానపల్లె

      నాలుగు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బనగానపల్లె పట్టణంలో 'జగనన్నే మా భవిష్యత్‌ - మా నమ్మకం నువ్వే జగనన్న' కార్యక్రమాన్ని మాజీ మంత్రి, నంద్యాల జిల్లా అబ్జర్వర్‌, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఎర్ర బోతుల పాపిరెడ్డిలు ప్రారంభించారు. పట్టణంలోని ముత్తు మియ్యా స్ట్రీట్‌లో జిల్లా అబ్జర్వర్‌, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్‌ చైర్మన్‌లు ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి, ప్రభుత్వ పని తీరు ఎలా వుంది, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎలా పథకాలు అందుతున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు జగనన్న సంక్షేమ పథకాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. నాలుగు సంవత్సరాల పాలన బాగుందని, ప్రజలు మళ్లీ సిఎంగా జగన్మోహన్‌ రెడ్డి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకోవలసిన బాధ్యత కన్వీనర్లదే
మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి
ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుండి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, ముఖ్య కార్యకర్తలపై ఉందని మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో సచివాలయ కన్వీనర్లు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 రోజుల పాటు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, ముఖ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ, సిఎం పాలన ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎపి ఇరిగేషన్‌ అభివృద్ది కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కర్రా గిరిజారెడ్డి, చల్లా విజ్ఞేశ్వర్‌ రెడ్డి, అవుకు జడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మీ, వైసిపి అవుకు మండల కన్వీనర్‌ కాటసాని తిరుపాల్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గుండం శేషిరెడ్డి, గుండం సూర్యప్రకాశ్‌ రెడ్డి, పోచ శీలా రెడ్డి, కొలిమగుండ్ల మండల కన్వీనర్‌ అంబటి గురివి రెడ్డి, నాయకులు డాక్టర్‌ మహమ్మద్‌ హుస్సేన్‌, అత్తార్‌ జాహీద్‌ హుస్సేన్‌, బండి బ్రహ్మానంద రెడ్డి, ఎల్వి సుధాకర్‌ రెడ్డి, పసుపల జనార్దన్‌ రెడ్డి, సయ్యద్‌ సజ్జాత్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.