
కదిరి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ అవలంభిస్తున్న అరాచక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలా టిడిపి ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో 'బాబుతో నేను' కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు పట్టణంలోని 29వ వార్డులో శనివారం నాడు టిడిపి పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రాజకీయంగా ఎదుర్కొనలేకన చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్రజలకు తెలియజేశారు. వైసిపి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఖాదర్ బాషా, దాదాపీర్, తెలుగు యువత నాయకులు షాకీర్, ఫారుక్, ఇంతియాజ్, సోహెల్ పాల్గొన్నారు.