కడప అర్బన్ తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నారని ఆ పార్టీ కడప నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి వి. ఎస్. అమీర్ బాబు, సీనియర్ నాయకులు అలంకాన్ పల్లి లక్ష్మీరెడ్డి, యువ నాయకులు మన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని 37వ డివిజన్ ఇన్‌ఛార్జి జకీర్ హుస్సేన్, డాక్టర్ అసోసియేషన్ కార్యదర్శి నసీవుద్దీన్ ఆధ్వ ర్యంలో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టా రంటూ ప్రజలకు తెలుపుతూ ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రానికి చేసిన మేలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎన్నో కుటుంబాలకు బాసటగా నిలి చారని పేర్కొన్నారు. ఎటువంటి ఆధారం లేని కేసులో అరెస్టు చేసి 51 రోజులు గడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి పైశాచిక ఆనందం ఇంకా తీరలేదన్నారు. కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు కొండా సుబ్బయ్య, కడుప నగరం ఉపాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది లింగాల శంకర్ రెడ్డి, ఆదిల్, మాజీ సర్పంచ్ వెంకటేష్, మైనార్టీ కార్యదర్శి నాసర్ అలీ, జయరాం రెడ్డి, ఓబుల్ రెడ్డి, పిచ్చయ్య, బాబా ఫక్రుద్దీన్, మామిళ్ళ శివ, చిప్పగిరి శీను, ఫజల్, సాదక్, వసీం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.