Apr 30,2023 02:04
బైక్‌ ర్యాలీ

ప్రజాశక్తి-పర్చూరు: జగన్‌ మోహన్‌రెడ్డి కార్యకర్తలను నమ్ముకుంటే చంద్రబాబు నాయుడు మీడియాను నమ్ముకున్నారని వైసీపీ పర్చూరు సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్‌ విమర్శించారు. పర్చూరు అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైసీపీ కార్యక్రమాలకు వస్తున్న ప్రజాదరణతో పార్టీ గ్రాఫ్‌ 5 శాతం పెరిగిందన్నారు. ప్రభుత్వం సంక్షేమంతో పాటు పలు అభివృద్ధి పనులు కూడా చేస్తోందని వివరించారు. నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతుంటే ఎక్కడా వ్యతిరేకత లేదని వివరించారు. అభివృద్ధి కోసమే జగన్‌ మోహన్‌రెడ్డి అప్పు తెచ్చారని, అవసరం లేకపోయినా చంద్రబాబు నాడు ఎందుకు అప్పు తెచ్చారో చెప్పాలన్నారు. అనంతరం పర్చూరు నుంచి కారంచేడు వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చుండూరి రవి, ఏఎంసి చైర్మన్‌ జువ్వా శివరాం ప్రసాద్‌, పర్చూరు మండల కన్వీనర్‌ కఠారి అప్పారావు, కారంచేడు ఎంపిపి నీరుకట్టు వాసుబాబు, మాజీ ఎంపిపి కోట హరిబాబు, మల్లా శ్రీనివాసరావు, తోకల కృష్ణమోహన్‌, ముప్పాళ్ళ రాఘవయ్య, దండా చౌదరి, బండారు ప్రభాకర్‌, పఠాన్‌ కాలేషావలి, పోలూరి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.