Nov 18,2023 20:36

ప్రజాశక్తి - కాళ్ల
              కాళ్ల గ్రామ ప్రజలకు లంక ఛానల్‌ ద్వారా సురక్షిత నీరు అందించాలని, విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని కాళ్ల ఎంపిటిసి సభ్యులు పాపోలు సత్యవతి కోరారు. ఎంపిడిఒ కార్యాలయ సమావేశ మందిరంలో మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఎంపిపి పి.శిరీష విశ్వనాధరాజు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. మండలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అభివృద్ధి పనులపై చర్చించారు. ఎంపిడిఒ ఎంవి.భాస్కరరావు మాట్లాడుతూ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల సమన్యాయంతో ఉండాలన్నారు. మండల వ్యవసాయ అధికారి చామర్తి జయవాసుకి, హౌసింగ్‌ ఎఇ సి.ఆంజనేయరాజు, ఎంఇఒ గాదిరాజు కనకరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ గణేశ్న రాంబాబు, తహశీల్దారు టిఎ.కృష్ణారావు, మండల ఉపాధ్యక్షురాలు సరాబు పద్మారాణి, జిల్లా సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్షులు కొలుకులూరి ధర్మరాజు, విద్యుత్‌ శాఖ ఎఇ పి.రాంబాబు, పశువైద్యాధికారి చంద్రబాబు, మండల స్థాయి అధికారులు, ఎంపిటిసి సభ్యులు చిన్నాపరపు రాంబాబు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల ప్రస్తావన లేని సమావేశం
ఉండి : మండలంలో తాగునీటి సమస్య లేకుండా ప్రతిఒక్కరికీ తాగునీటిని అందించాలని ఎంపిపి ఇందుకూరి శ్రీహరినారాయణరాజు అన్నారు. ఎంపిపి అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం ప్రజా సమస్యల ప్రస్తావన లేకుండానే తూతూ మంత్రంగా సాగిందని పలువురు అంటున్నారు. వాండ్రం సర్పంచి దాసరి వెంకటకృష్ణ మాట్లాడుతూ గతంలోనే తమ గ్రామంలోని దళితవాడలో ఉన్న పాఠశాలకు నాడు-నేడు కార్యక్రమంలో నిధులు మంజూరయ్యాయని, దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించేందుకు ఆగస్టులో తమ గ్రామాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా నేటికీ ఆ ప్రతిపాదన పూర్తి కాలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ సర్పంచి కొండవీటి సాంబశివరావు, ఎంపిటిసి సభ్యులు మున్నలూరి సువర్ణలక్ష్మి శ్రీనివాస్‌, కునుకు రమాదేవి శ్రీనివాస్‌, నిమ్మల కేశవ్‌కుమార్‌, దత్తాల సుజాతరాణి, రాయి రావులమ్మ పాల్గొన్నారు.