ప్రజాశక్తి-ఉరవకొండ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడమే ధ్యేయమని ఫ్రీవిలేజ్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి తెలిపారు. విడపనకల్లు మండలం డోనేకల్లు గ్రామంలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఫౌండేషన్, సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో రూ.20లక్షలతో నిర్మించిన సామాజిక నీటి శుద్ధి కేంద్రాన్ని ఎమ్మెల్సీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ హైదరాబాద్ వారిని నీటి ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే పలుగ్రామాల్లో సామాజిక నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. అంతేగాకుండా గ్రామంలో దాదాపు రూ.90 లక్షలతో పూర్తి చేసిన సిమెంట్ రోడ్లు, డ్రెయినేజీలు తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన సర్పంచి ఎర్రమ్మను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఎర్రమ్మ, ఎంపిటిసి లక్ష్మి సత్యమయ్య, మాజీ సర్పంచులు లింగారెడ్డి, మల్లికార్జున, భీమలింగప్ప, అంగడి ఈశ్వరప్ప, పంపావతి, సురేష్, రాముడు, మాజీ ఎంపిపిలు రమణారెడ్డి, తిప్పయ్య, మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ రమణయాదవ్, సర్పంచులు జయేంద్రరెడ్డి, తిరుపాల్‌యాదవ్, ఇందిరమ్మ, రెనుమాకులపల్లి రామంజినేయులు, శివలింగ, వైసిపి నాయకులు కాకర్ల నాగేశ్వరరావు, చంద్రమోహన్‌రెడ్డి, గడేకల్ పంపాపతి, దిద్దేకుంట సూరి, ముష్టూరు ఎర్రిస్వామి, మాలపురం కేసన్న, గురుస్వామి, హావళిగి రామురెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.
నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ శివరామిరెడ్డి










