ప్రజాశక్తి-అనకాపల్లి
వైసిపి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక వేల్పుల వీధిలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.82 లక్షలతో కొండు పాలెం రోడ్డు మరమ్మతుకు, రూ.11 లక్షలతో వేల్పుల వీధి సీతారామ కళ్యాణ మండపం రోడ్డుకు, మిరియాల కాలనీలో రూ.23 లక్షలతో సిసి రోడ్లు డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో 83వ వార్డు కార్పొరేటర్ జాజుల ప్రసన్న లక్ష్మి, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైసిపి నాయకులు మందపాటి జానకి రామరాజు, జాజుల రమేష్, పలక రవి తదితరులు పాల్గొన్నారు.
కె.కోటపాడు : వివిధ సాంకేతిక లోపాలతో అర్హులై ఉండి పథకాలు మంజూరు కాలేని వారికి తప్పకుండా తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. బుధవారం మండలంలోని కూండ్రపువానిపాలెం, రామచంద్రపురం, బత్తివానిపాలెం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఈర్లే అనురాధ, ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, సర్పంచ్ బండారు ముత్యాల నాయుడు, దొగ్గ ఉమాశంకర్, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
మునగపాక రూరల్ : మండలంలోని పాటిపల్లి గ్రామ సచివాలయంలో ఎలమంచిలి శాసనసభ్యులు యువి రమణ మూర్తి రాజు బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మండలంలోని అరబుపాలెంలో తారు రోడ్డును ప్రారంభించారు. అరబుపాలెం, తిమ్మరాజుపేట, పాటిపల్లి గ్రామాల విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, జడ్పిటిసి పెంటకోట స్వామి సత్యనారాయణ, సర్పంచులు ఆడారి కృష్ణవేణి, బోడ్డెడ శ్రీనివాసరావు, కాండ్రేగుల నూకరాజు, వైసీపీ నాయకులు ఆడారి గణపతి అచ్చం నాయుడు, బొడ్డేడ బుజ్జి, భీమిశెట్టి ఉమాశంకర్, కాండ్రేగుల జగన్ పాల్గొన్నారు.










