ప్రజాశక్తి-చీరాల: సచివాలయంలోని సిబ్బంది గ్రామ పరిధిలోని ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించాలని తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని రామకష్ణాపురం సచివాలయాన్ని తహశీల్దారు విజిట్ చేశారు. పంచాయతీ కార్యాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించి కార్యదర్శి కిరణ్ కుమార్‌తో కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న పధకాల పంపిణీపై ఆరా తీశారు. అలాగే విధిగా మంజూరు జాబితాను సచివాలయంలో ప్రదర్శనగా ఉంచాలన్నారు. హౌసింగ్ నిర్మాణాలపై సుదీర్ఘంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న వారిని గుర్తించి పనులు వేగవంతంగా ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రికార్డులు పరిశీలించి తగు సూచనలు అం దించారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.










