ఐరిస్ పరికరాలు పంపిణీ చేస్తున్న సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్
ప్రజాశక్తి - ఆదోని
పౌరసరఫరాల శాఖ సేవలను ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలోకి తీసుకొచ్చిందని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. మంగళవారం సబ్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రేషన్ వాహన ఆపరేటర్లకు ఐరిస్ పరికరం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడారు. ప్రజలకు బియ్యం పంపిణీ చేసే విషయంలో బయోమెట్రిక్ వేసి పంపిణీ చేసే కార్యక్రమం ఉంటుందన్నారు. సాంకేతిక సమస్యలు ఉత్ఫన్నం కాకుండా ప్రభుత్వం నూతన టెక్నాలజీ ఐరిస్ డివైస్‌ను తీసుకొచ్చిందని తెలిపారు. ఆదోని డివిజన్‌లో 163 రేషన్ వాహన ఆపరేటర్లకు డివైస్‌పై అవగాహన కల్పించినట్లు తెలిపారు. పౌర సరఫరాల ఉప తహశీల్దార్ వలీ బాష పాల్గొన్నారు.










