Nov 03,2023 21:01

వైద్యాధికారులతో ఎంపిపి వెంకటరమణ నాయుడు

ప్రజాశక్తి - వీరఘట్టం :  ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు తమ వంతు కృషి చేయాలని ఎంపిపి డి.వెంకటరమణనాయుడు అన్నారు. మండలంలోని నడిమికెళ్లలో శుక్రవారం నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు క్షుణ్ణంగా వైద్య తనిఖీలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలన్నారు. అంతకుముందు ఐసిడిఎస్‌ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 450 మందికి పైబడి వైద్య తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ డోకల సుజాత- శ్రీనివాసరావు, ఉప సర్పంచ్‌ జి.గౌరీశంకర్‌, పిఎసిసి డైరెక్టర్‌ భోగి లతా మాణిక్య చంద్రశేఖర్‌, వైద్యాధికారులు పి.ఉమామహేశ్వరి, ఎస్‌.నితీసా, ఎస్‌.సుకన్య, కె.సునీల్‌రెడ్డి, బి.ఉమ, పలువురు అధికారులు, సిబ్బంది, ఎఎన్‌ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.