Jun 08,2023 00:18

సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న మోపిదేవి

ప్రజాశక్తి- చెరుకుపల్లి : గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నట్లు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. మండల పరిధిలోని పొన్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎంపీ మోపిదేవి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి పలు సంక్షేమ పథకాలు, ప్రజలకు అవసరమైన అన్ని పనులను తమ గ్రామాల్లోనే పొందే సౌకర్యం కల్పించి నూతన శకానికి నాంది పలికిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కు తుందన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ దేశంలోనే విప్లవాత్మ మార్పులను సష్టించిందన్నారు. ఈ కార్యక్రమంలో బుడ చైర్మన్‌ దేవినేని మల్లికార్జున రావు, వైసిపి మండల కన్వీనర్‌ పైన ఏడుకొండల రెడ్డి, ఎంపీపీ రత్న ప్రసాద్‌, జడ్‌పిటిసి మర్రివాడ వెంకట పావని ప్రసాద్‌, వైస్‌ ఎంపీపీ పైనం రంగారెడ్డి, పైన బసవ పున్నమ్మ, మాజీ ఎంపీపీ చన్ను కోటేశ్వరరావు, తహశీల్దారు మల్లికార్జునరావు, ఎంపిడిఒ శ్రీనివాసరావు, బండారు రామారావు తదితరులు పాల్గొన్నారు.