హిందూపురం : మున్సిపల్ అధికారులు పుర ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజ అన్నారు. శుక్రవారం రాత్రి 7వ వార్డు వార్డు ముక్కడిపేటలో చెట్టు కూలిపోయి, విద్యుత్ తీగలపై పడింది. దీంతో రాత్రి నుంచి ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలచిపోయింది. ఈ విషయవ తెలిసిన వెంటనే శనివారం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్‌తో కలిసి ఆమె వార్డులో పర్యటించారు. మున్సిపల్ కార్మికులతో చెట్టును తొలగించి, విధ్యుత్ అధికారులతో చర్చించి వెంటనే విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నాసీరా బాను, ఎంఈ వెంకటరమణ, ఎఈ నాగేంద్ర, శానిటరీ ఇన్స్‌పెక్టర్ శంకర్ తదితరులు పాల్గోన్నారు.
పనుల్లో నాణ్యత ప్రమానాలు పాటించాలి
రైల్వే రోడ్డులో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.26లక్షలతో చేపడుతున్న మురుగు కాలవ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తేదారులకు సూచించారు. శనివారం పనులనుయ ఆమె పరిశీలన చేశారు. అదే విధంగా విధ్యుత్ అధికారులతో మాట్లాడి రోడ్డుకు ఇరువైపుల ఉన్నా విద్యుత్ స్తంభాలను వెంటనే మార్చాలని సూచించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ వెంకటరమణ, ఎఈలు నాగేంద్ర, జనార్ధన్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.










