Aug 23,2023 00:21

మాట్లాడుతున్న ఎంపిపి కారం లక్ష్మి, చిత్రంలో జెడ్‌పిటిసి, ఎంపిడిఒ, తహశీల్దారు

ప్రజాశక్తి- విఆర్‌.పురం
అధికారులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని ఎంపిపి కారం లక్ష్మి అన్నారు. మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపిపి కారం లక్ష్మి అధ్యక్షతన స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. సభ్యులు మాట్లాడుతూ విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని, వరద బాధితులకు సహాయం, టార్పాలిన్లు అందరికీ అందజేయాలని కోరారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని విజ్ఞప్తి చేశారు. జెడ్‌పిటిసి సభ్యులు వాళ్ల రంగారెడ్డి, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ రత్నకుమారి, తహశీల్దారు ఎన్‌.శ్రీధర్‌, రేఖపల్లి సర్పంచ్‌ పూనెం సరోజినీ, చిన్న మట్టపల్లి ఎంపీటీసీ పూనెం ప్రదీప్‌ కుమార్‌, సర్పంచ్‌ వెట్టి లక్ష్మి, రామవరం సర్పంచ్‌ కారం బుచ్చమ్మ, ములకనపల్లి సర్పంచ్‌ సవల మారయ్య, పలువరు సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.