ప్రజాశక్తి - యడ్లపాడు : ఆశయం కోసం జీవితాంతం అంకిత భావంతో పోపూరి రామారావు పాటుపడ్డారని, పేదల అభ్యున్నతి, సమసమాజ స్థాపన కోసం కృషి చేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. రామారావు అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు అర్పించే నివాళి అని అన్నారు. పోపూరి రామారావు 4వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన యడ్లపాడులోని పోపూరి రామారావు విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం 'దేశ సంపద దోపిడి - ప్రజలపై భారాలు - కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు' అంశంపై స్మారకోపన్యాసం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సిపిఎం మండల కన్వీనర్ టి.కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద బిజెపి 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతోందని, గత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్థిక సంస్కరణలను మరింత వేగంగా అమలు చేస్తోందని విమర్శించారు. ఈ క్రమంలోనే రైతు కేంద్రంగా ఉన్న వ్యవసాయాన్ని దివాళా తీయిస్తోందని, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి వీలుగా మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చిందని తెలిపారు. అయితే రైతులు ఆ చట్టాలను పోరాటం ద్వారా తిప్పికొట్టారని గుర్తు చేశారు. జీఎస్టీని తెచ్చి అన్ని నిత్యావసరాలపైనా పనులేస్తూ ధరలను పెంచారని, ప్రజలకు అందుబా టులో లేని విధంగా ధరలున్నాయని, ఇదే క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ల అప్పగించడంతోపాటు వారి ఆదాయాలు పెంచేలా విధానాలను అమలు చేశారని వివరించారు. 2014 నాటికి ప్రపంచ కుబేరుల్లో 695వ స్థానంలో ఉన్న అదానీ 2023లో రెండోస్థా నానికి ఎగబాగడం ఇందుకు నిదర్శన మన్నారు. మరోవైపు ప్రజల ఆర్థిక అభివృద్ధి దిగజారిందని, ఆకలి సూచిలోనూ దేశం స్థానం దిగువకు పడిపోయిందని తెలిపా రు. ఈ అంశాపై ప్రజల దృష్టి పడకుండా మత విద్వేషాలను బిజెపి రెచ్చగొడు తోదంని, తద్వారా రాజకీయ లబ్ధి పొంద డానికి కుట్రలు చేస్తూ ప్రజలకు గుదిబండగా మారిందని దుయ్యబట్టారు. మణిపూర్ ఘటనపై పార్లమెంటులో ప్రధాని మోడీ మాటల్లో నిజాయితీ లేదని అన్నారు. ప్రజల్లో ఐక్యతను దెబ్బతీస్తూ మత, జాతి విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను ఎదుర్కోవడమే అమరవీరులుకు మనమిచ్చే నివాళి అని అన్నారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్ మాట్లాడుతూ పోపూరి రామారావు నడిచిన బాట ఆదర్శవం తమైందని, సయపాలన, క్రమశిక్షణకు ఆయన నిదర్శనమని చెప్పారు. ప్రజల కష్టాలకు ప్రభుత్వాల విధానాలే కారణమని, పార్లమెంటులో అబద్ధాలు చెప్పే ప్రధాని తొలిసారిగా చూస్తున్నామని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక దేశం అన్ని రంగాల్లో దిగజారిందని, విద్వేష రాజకీయాలను ఎదుర్కొవడానిక ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులు ఎన్.కాళిదాసు మాట్లాడుతూ ఎమర్జెన్సీ తర్వాత సిపిఎం పునర్నిర్మాణంలో పోపూరి రామారావు కృషి ఎనలేనిదన్నారు. నైతికత, నిబద్ధతతో ఆయన రాజకీయం నడిపారని, అన్ని తరగతుల పేదల జీవితాల మెరుగు కోసం పోరాడారని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె.రోశయ్య, నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ సృజన, సిపిఎం సీనియర్ నాయకులు పి.సుబ్బారావు పాల్గొన్నారు.
రామారావు విగ్రహానికి పూలమాలలు
పోపూరి రామారావు విగ్రహానికి సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి సిహెచ్ సత్యనారాయణ పూలమాలలేసి నివాళులర్పించారు. పి.గంగయ్యచౌదరి, ఎన్.తులశయ్య, టి.ప్రతాపరెడ్డి, పి.వెంకటే శ్వర్లు, బి.శంకరరావు, సుందరయ్య స్మారక నాటకోత్సవ కమిటీ కార్యదర్శి ఎం.రామా రావు. ఎం.పద్మారావు, జె.శంకరరావు, జి.హరిబాబు, ఎన్.జయలక్ష్మి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి : పోపూరి రామారావును స్ఫూర్తిగా తీసుకుని పని చేయాలని సిపిఎం సీని యర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది పిన్నమనేని పాములయ్య అన్నారు. స్థానిక పుతుంబాక భవన్‌లో జడ రాజకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో పాములయ్య మాట్లాడుతూ రామారావు చిన్నతనం నుండి కమ్యూనిస్టు ఉద్యమంలో అంకితభా వంతో పని చేశారని, అనేక పోరాటాల ద్వారా తన జీవితాన్ని జనం కోసం అంకితం చేశారని చెప్పారు. సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు జి.బాల కృష్ణ మాట్లాడుతూ యడ్లపాడు సర్పంచిగా రామారావు పనిచేసి ఆదర్శవంతంగా గ్రామాన్ని తీర్చిదిద్దారని, పార్టీ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. తొలుత రామారావు చిత్రప టానికి పూలమాలలేశారు. కె.శివదుర్గారావు, పి.సూర్యప్ర కాశరావు, ఎ.వీరబ్రహ్మం, వై.వెంకటరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - ముప్పాళ్ల : మండలంలోని మాదలలో సిపిఎం కార్యాలయంలో రామారావు చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. జిల్లా నాయకులు జి.బాలకృష్ణ మాట్లాడారు. జి.జాలయ్య, కె.నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, టి.బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










