Jul 16,2023 01:33
సమావేశంలో మాట్లాడుతున్న శాసనససభ్యులు కోన రఘుపతి

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: ప్రజలకు మరింత చేరువ అవటమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సురక్ష పథకాన్ని రూపొందించారని శాసన సభ్యులు కోన రఘుపతి అన్నారు. మండలం లోని ఖాజీపాలెం గ్రామంలో శనివారం నిర్వహించిన సురక్ష కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోనా మాట్లాడుతూ ప్రజలకు రక్షగా ఈ సురక్ష కార్యక్రమం ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజల పట్ల చేసిన నిర్లక్ష్యం ఇప్పుడు లేకుండా ప్రజల వద్దకు పాలన అందిస్తున్నామని అన్నారు. ప్రజలకు అవసరమైన పత్రాలను నేరుగా ఈ కార్యక్రమం ద్వారా కాలాతీతం కాకుండా అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీల విమర్శలు అర్ధరహితం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు అనంత వర్మ రాజు, మండల ఉపాధ్యక్షుడు రామరాజు, లీల శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌ కుంఠం అనూష, ప్రసన్న రాజు, ఎంపీటీసీ కాగిత కాంత కుమారి, ఎంపీడీఓ శేషమాంబ, సుబ్బారావు, కోటేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.