
ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు చేరువ చేయడం జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మండలంలోని క్రిష్ణపల్లి గ్రామంలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్) కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకమైన పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. వీటి ద్వారా పేదలకు మెరుగైన నాణ్యత కలిగిన సేవలు అందుతాయన్నారు. పెదబొండపల్లి, బందలుప్పి పిహెచ్‌సిల వైద్యులు అనూష, తిరుమల ప్రసాద్ రోగులకు తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోను లక్ష్మి, వైద్యులు ధరణి, ఎంపిహెచ్‌ఇఒ వెంకటనాయుడు, హెల్త్ సూపర్‌వైజర్ శంకర్రావు, వైసిపి నాయకులు బలగ నాగేశ్వరరావు, బొమ్మి రమేష్, ఎం. చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని ఎల్విన్‌పేట పంచాయతీ జాతపు కోటపాడు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ ఆర్.చైతన్య స్రవంతి ప్రారంభించారు. పంచాయతీ పరిధిలో గ్రామాల్లో గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. వైద్యులు అభిలాష్ రోగులకు సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి జగదీష్ కుమార్, సిడిపిఒ సుశీలా దేవి, పంచాయతీ కార్యదర్శి శ్యామల, వైద్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సాలూరురూరల్ : మండలంలోని కూర్మరాజుపేటలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని డిప్యూటీ డిఎంహెచ్‌ఒ శివకుమార్ సందర్శించారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి రెడ్డి సురేష్, వైసిపి మండల అధ్యక్షులు సువ్వాడ భరత్ శ్రీనివాస రావు, కె.తవిటినాయుడు, ఎంపిడిఒ జి.పార్వతి పాల్గొన్నారు.
వీరఘట్టం : మండలంలోని నడుకూరు గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు, డిఎంహెచ్‌ఒ జగన్నాథరావు సందర్శించారు. సుమారు 350 మందికి వైద్యులు ఉమామహేశ్వరి, మానస, వైవికె రమణ, ఎస్.సింధు, ఎం.రాజేష్‌కుమార్ పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. రక్తహీనత కలిగిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిఎంహెచ్‌ఒ బి.జగన్నాథరావు వైద్యసిబ్బందిని ఆదేశించారు. రక్తహీనతతో గర్భిణులు, విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. వైద్య తనిఖీలు నిర్వహించి, క్రమం తప్పకుండా ఐరన్ మాత్రలు మింగించాలని సిబ్బందిని ఆదేశించారు. వీటి విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం చూపితే వారికి మెమోలు జారీ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యాధికారి పి.ఉమామహేశ్వరి, సూపర్వైజర్లు జనార్దన్‌రావు, ఒ.శాంతికుమారి, సర్పంచ్ కర్రి రమాదేవి, ఎంపిటిసి వై.జయశ్రీ, పిఎసిఎస్ డైరెక్టర్ భోగి లత, మాణిక్య చంద్రశేఖర్, ఎంపిడిఒ వై.వెంకటరమణ, ఐసిడిఎస్ సూపర్వైజర్లు జనార్ధనరావు, శాంతకుమారి, ఎన్.రాజేశ్వరి, సచివాలయ కార్యదర్శి మధు, విఆర్‌ఒ ఎం.సింహాచలం పాల్గొన్నారు.
సీతానగరం : అయోడిన్ లోపంతో పిల్లలో మానసిక వృద్ధి, మనోవికాసం లోపిస్తాయని, బుద్ధి మాంద్యం కలిగే అవకాశం ఉందని డిఐఒ టి.జగన్మోహనరావు తెలిపారు. ప్రతిఒక్కరూ అయోడైజ్డ్ ఉప్పునే ఆహార పదార్థాల్లో వినియోగించాలని కోరారు. సీతానగరంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన పర్యవేక్షించి, అక్కడ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ జె.తేరేజమ్మ, జెడ్‌పిటిసి ఎం.బాబూజీ, వైద్యాధికారి కె.శిరీష, నాయకులు జి.సూర్యనారాయణ, ఎస్.కిరణ్‌కుమార్, సూపర్‌వైజర్లు ఎస్‌వి రమణ, జయగౌడ్ పాల్గొన్నారు.
సీతానగరం : పెదబోగిలిలో గురువారం నిర్వహించిన ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే జోగారావు సందర్శించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ బి.కృష్ణమహేశ్ రెడ్డి, ఎంఇఒ జి.సూరిదేవుడు, వైద్యాధికారులు కె.శిరీష, ఉషారాణి, వైసిపి నాయకులు బి.చిట్టిరాజు, జెడ్‌పిటిసి ఎం.బాబ్జి, ఎంపిపి బి.శ్రీరాములునాయుడు, ఎంపిటిసిలు బురిడి సూర్యనారాయణ, ఎస్.కిశోర్ పాల్గొన్నారు.