ప్రజాశక్తి - కౌతాళం
మండలంలోని వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఎంపిడిఒ సుబ్బరాజు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కామవరం, ఉరుకుంద గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, సచివాలయ బయోమెట్రిక్ అటెండెన్స్‌ను పరిశీలించారు. వైఎస్‌ఆర్ బీమా ఎన్‌రోల్‌మెంట్, వివిధ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై వివరాలను పంచాయతీ కార్యదర్శుల ద్వారా తెలుసుకున్నారు. ఉరుకుంద గ్రామ పంచాయతీలోని అంగన్వాడీ-1 కేంద్రాన్ని తనిఖీ చేసి, ఆయాతో మెనూ ప్రకారం భోజన పదార్థాల అందిచారా అని అడిగి తెలుసుకున్నారు. సర్పంచి వసంత్, పంచాయతీ కార్యదర్శులు శివప్ప, శ్రీరాములు పాల్గొన్నారు.
సమీక్ష సమావేశం : ఎంపిడిఒ కార్యాలయ సమావేశ మందిరంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లతో ఎంపిడిఒ సుబ్బరాజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సచివాలయ సిబ్బంది అందరూ క్రమం తప్పకుండా వేళకు బయో మెట్రిక్ అటెండెన్స్‌ను వేయాలని ఆదేశించారు. మండల స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించే సమావేశానికి మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తప్పకుండా హాజరు కావాలని పేర్కొన్నారు.
సిబ్బందితో మాట్లాడుతున్న ఎంపిడిఒ










