Nov 04,2022 23:40

మాట్లాడుతున్న ఎంపిడిఒ

ప్రజాశక్తి-నాతవరం:మండలంలోని గన్నవరం సచివాలయాన్ని ఎంపీడీవో యల్‌.యాదిగేశ్వరరావు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి సచివాలయ సిబ్బందికి సూచనలు చేశారు. వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది గ్రామస్తు లకు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామస్తుల నుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. జగనన్న కాలనీలు త్వరగాపూర్తి అయ్యే విధంగా చూడాలన్నారు. ఇల్లు నిర్మిస్తున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరులో ఆలసత్వం కాకుండా చూడాలని చెప్పారు. అనంతరం ఆర్బికే కేంద్రాన్ని పరిశీలించారు.