May 18,2023 20:01

బుక్‌లెట్‌ను అందజేస్తున్న ప్రదీప్‌రెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మంజూరు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు అండగా ఉంటాయని, జగనన్నకు ప్రజలు అండగా ఉంటారని వైసిపి రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై.ప్రదీప్‌ రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని మాలపల్లి గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి వివరించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్‌ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని తెలిపారు. అనంతరం గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. వైసిపి మండల అధ్యక్షులు జి.భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.