ప్రజాశక్తి-కాకినాడ, రూరల్ కుట్రలను నమ్ముకున్న జగన్‌కు ప్రజలే తమ ఓటుతో తగిన బుద్ధి చెబుతారని కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బాబుకు తోడుగా మేము సైతం కార్యక్రమంలో భాగంగా కొండబాబు 10వ డివిజన్‌లో బుధవారం పర్యటించారు. బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభవద్ధిలో, పెట్టుబడుల ఆకర్షణలో, ఉపాధి కల్పనలో అగ్రస్థానంలో ఉందన్నారు. జగన్ అధికారం చేపట్టిన తర్వాత అక్రమ కేసులు, అరెస్టులు, తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తుమ్మల సునీత, ఎరిపిల్లి రాము, మూగు రాజు, చోడిపిల్లి సతీష్, తిరిదు ఎల్లయ్యమ్మ, దుడా పావని, ఎరిపిల్లి అబ్బాయి పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని తూరంగి పంచాయతీ వెలమపేటలో బాబుతో నేను కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి మాట్లాడారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి సభ్యుడు బుంగా సింహాద్రి, పట్టా ప్రకాష్ గౌడ్, మాజీ ఎంపిపి గుల్లిపల్లి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్‌ఛార్జి మిరపల సూర్య ప్రకాష్ పాల్గొన్నారు.










