Nov 04,2023 23:33

టిడిపి మినీ మ్యానిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పలువురు పార్టీ నాయకులు పిలుపు ఇచ్చారు. శనివారం పలుచోట్ల ప్రచారం నిర్వహించారు. కాకినాడలో రాజా ట్యాంక్‌, వివేకానంద పార్కులో మాజీ మేయర్‌ సుంకర పావని ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. పార్వతి, సాన లక్ష్మి, రిక్క అమ్మజి, తోట అమ్ములు, బురిడీ సింహాచలం, శ్రీవాణి, మహేశ్వరీ, దేవి, దుర్గ, కాంతం,శైలజ, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ ఇర్రిపాకలో బాబు ష్యూరిటీ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, బస్వా సూర్యప్రకాశరావు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ మండలం హుస్సేన్‌పురంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్‌, చల్లా బుజ్జి, పనసపాడు సర్పంచ్‌ చీకట్ల వెంకటేష్‌ పాల్గొన్నారు.