ప్రజాశక్తి-యంత్రాంగం ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్యం అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని పలువురు అన్నారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించారు. కాకినాడ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక రేచర్లపేటలోనిప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాలుగు డివిజన్లకు సంబంధించి సుమారు 25 వేల కుటుంబాలను ఎఎన్‌ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బంది స్వయంగా కలిసి ఆరోగ్య సమస్యలపై సర్వే చేశారన్నారు. బిపి, సుగర్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధి లక్షణాలపై గుర్తించి ఆరోగ్య సురక్ష శిబిరంలో వైద్య సేవలు అందించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందిస్తున్నామన్నారు. కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. పేద ప్రజలకు ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమల్లో తీసుకొచ్చారన్నారు. వైద్యరంగంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువచేశాయన్నారు. ఆరోగ్యశ్రీని పటిష్టవంతం చేయడం, కొత్త మెడికల్ కళాశాల ఏర్పాటు, పోస్టుల భర్తీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివద్ధి వంటి చర్యలే ఇందుకు నిదర్శనమన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్.నాగనరసింహారావు మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఇళ్లకు వచ్చే వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించి, ఆరోగ్య సమస్యలు ఉంటే తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సుంకర శివప్రసన్న, ఎఎంసి చైర్‌పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, ఎంహెచ్‌ఒ డాక్టర్ పృథ్వీ చరణ్, మాజీ కార్పొరేటర్లు నల్లబిల్లి సుజాత, రోకళ్ల సత్యనారాయణ, శిగల మధు, కర్రి శైలజ, పోలిశెట్టి పద్మావతి, బండి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు బోరా వెంకటేశ్వరరావు, కొంతం శ్రీనివాసరావు, స్థానిక నాయకులు తొంపల తాతారావు, నందకుమార్, బత్తిన రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గండేపల్లి గామాల్లో ప్రతి సచివాలయంలోనూ నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం అందరికీ ఆరోగ్య రక్ష అని జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు తెలిపారు. గండేపల్లి మండలం మురారి గ్రామంలో ఉప సర్పంచ్, యువ నాయకులు జాస్తి వసంత్ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చలగళ్ల దొరబాబు, జెడ్‌పిటిసి పరిమి వెంకటలక్ష్మి మంగతాయారు బాబు, వైస్ ఎంపిపి కుంచే కుంచె రాజా, కందుల చిట్టిబాబు, జాస్తి వసంత్, జనపరెడ్డి బాబు, కేతిన బాబి, సర్పంచ్ కుక్కల ఆనందబాబు, ఎంపిడిఒ ఎంపీడీవో రామన్, తహశీల్దారు సత్యనారాయణ, ఒబిన్ని వీరబాబు, పాము సూరిబాబు, దాసరి ధన, మన్యం ప్రసాద్ పాల్గొన్నారు. తాళ్లరేవు ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్నదే సిఎం జగనన్న సంకల్పం అని ఎఎంసి చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ అన్నారు. ఇంజరంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. సర్పంచ్ ముద్దన వెంకట శివరామ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కోరుకొండ కిరణ్ కుమారి, ఉపసర్పంచ్ కోరుకొండ అప్పారావు, వైసిపి నాయకులు పెయ్యల కొండబాబు, చేదూరి అరవింద్, కోరుకొండ చంటి, వీర సురేష్, కడియాల చినబాబు, రాజు పాల్గొన్నారు. పెద్దాపురం తాటిపర్తిలో నిర్వహించిన జగనన్న సురక్ష శిబిరాన్ని శుక్రవారం హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి గవరసాన సూరిబాబు, కంటే వీర రాఘవరావు, పిఎసిఎస్ చైర్మన్ గోపు నారాయణమూర్తి, ఉప సర్పంచ్ గోపు మురళి పాల్గొన్నారు.










