ప్రజాశక్తి-గజపతినగరం : ప్రజల వద్దకే మరిన్ని ఆరోగ్య సేవలు ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు. శనివారం మండలంలోని ముచ్చర్ల గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి గార తవుడు, ఎంపిపి బెల్లాన జ్ఞానదీపిక, వైసిపి మండల అధ్యక్షులు బూడి వెంకటరావు, పిఎసిఎస్ అధ్యక్షులు కరణం ఆదినారాయణ, సర్పంచులు బెల్లాన త్రినాథరావు, వైద్యాధికారులు ఎం.కృష్ణారెడ్డి, అనూజ్ రారు, కిరణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
తెర్లాం : కూనాయవలస గ్రామ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు ప్రారంభించారు. రోగులకు వైద్యులు పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పౌష్టికాహార స్టాళ్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి లక్ష్మణరావు, ఎంపిడిఒ రామకృష్ణ, ఎంపిపి ఉమాలక్ష్మి, ఎఎంసి చైర్మన్ శ్రీనివాసరావు, వైస్ ఎంపిపి ఎస్.సత్యనారాయణ, ఐసిడిఎస్ పిఒ కె.రాజ్యలక్ష్మి, సర్పంచ్ బి.విజయబాబు, సెక్రెటరీ స్వామి పాల్గొన్నారు.
కొత్తవలస : మండలంలోని ముసిరాం ప్రాథమికోన్నత పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రారంభించారు. ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, వైసిపి మండల అధ్యక్షులు ఒబ్బిన నాయుడు, పిఎసిఎస్ అధ్యక్షులు గొరపల్లి శివ, సర్పంచ్ చింతల రాములమ్మ, మాజీ సర్పంచ్ పైడినాయుడు, యాత కార్పొరేషన్ డైరెక్టర్ డి.రమణ, ఎంపిడిఒ పద్మజ పాల్గొన్నారు.
రామభద్రపురం : రామభద్రపురంలో కనిమెరకవీధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు ప్రారంభించారు. సుమారు 500 మంది ఈ శిబిరంలో వైద్య సేవలు పొందారు. ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు, జెడ్‌పిటిసి అప్పికొండ సరస్వతి, ప్రోగ్రామ్ ఆఫీసర్ రవికుమార్, మండల ప్రత్యేకాధికారి గోవిందరావు, ఎంపిడిఒ రమామణి పాల్గొన్నారు.
మెరకముడిదాం : పేదల ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రభుత్వం తీసుకుంటుందని జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని ఉత్తరావిల్లి సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్షను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి తాడ్డి కృష్ణవేణి, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్‌వి రమణరాజు, వైసిపి మండల అధ్యక్షులు కోట్ల విశ్వేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడ్డి వేణుగోపాలరావు, వైస్ ఎంపిపి తలచుట్ల హరిబాబు, నాయకులు మండల సత్యనారాయణ పాల్గొన్నారు.
డెంకాడ : రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కాపాడటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలో పినతాడివాడలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో 385 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి బంటుపల్లి వాసుదేవరావు, బడ్డుకొండ చిన్న, వైస్ ఎంపిపి పిన్నింటి తమ్మినాయుడు, తహశీల్దార్ పి.ఆదిలక్ష్మి, ఎంపిడిఒ స్వరూపారాణి, సర్పంచ్ లంక లక్ష్మణరావు, ఎంపిటిసి విజయనాయుడు, మాజీ సర్పంచ్ వాళ్లే వెంకట్రావు, ఉపసర్పంచ్ రావాల అప్పలనాయుడు పాల్గొన్నారు.
శృంగవరపుకోట : మండలంలోని గోపాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎంపిపి సండి సోమేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి ఎం.వెంకటలక్ష్మి, వైస్ ఎంపిపి ఇందుకూరి సుధారాజు, ఎంపిటిసి గుమ్మడి సన్యాసప్పడు, రంధి వెంకట గణేష్, సీతారాంపురం సర్పంచ్ మిడతాన చిన్నంనాయుడు, తగరంపూడి రమణ, కిషోర్, ఎంపిడిఒ శేషుబాబు పాల్గొన్నారు.
పూసపాటిరేగ : ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. మండలంలోని కనిమెళ్లలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు, ఎంపిపి మహంతి కళ్యాణి, జెడ్‌పిటిసి మహంతి సీతాలక్ష్మి, వైస్ ఎంపిపి అల్లాడ రమేష్, ఎన్.సత్యనారాయణ రాజు, జెసిఎస్ కన్వీనర్ మహంతి శ్రీనివాసరావు, సర్పంచ్ నడిపేన రమణ, వైద్యులు రాజేష్‌వర్మ పాల్గొన్నారు.
వేపాడ : మండలంలో సింగరాయి, ఆతవ, రామస్వామిపేట గ్రామాల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపిపి డి.సత్యవంతుడు ప్రారంభించారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు ఎం.జగన్నాథం, ఎంపిడిఒ బిఎస్‌కెఎన్ పట్నాయక్, వైద్యాధికారులు ధరణి, రాజు, రమాదేవి, తదితరులు కన్వీనర్లు పాల్గొన్నారు.
గుర్ల : మండలంలోని పాలవలసలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ శిబిరాన్ని డిఎంహెచ్‌ఒ భాస్కరరావు తనిఖీ చేశారు. ఈ శిబిరంలో 425 మందికి పరీక్షలు చేశారు. మందులు అందజేశారు. 56 మందికి కంటి సమస్యలున్నట్లు గుర్తించారు. కార్యక్రమంలో ఎంపిపి పొట్నూరు ప్రమీల, జెడ్‌పిటిసి సీర అప్పలనాయుడు, డిఎల్‌డిఎ చైర్మన్ బెల్లాన బంగారు నాయుడు, నాయకులు పొట్నూరు సన్యాసినాయుడు పాల్గొన్నారు.
భోగాపురం : మండలంలోని బైరెడ్డిపాలెం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు శనివారం ప్రారంభించారు. 276 మంది వైద్య పరీక్షలు చేసుకున్నట్లు పోలిపల్లి వైద్యాధికారి తిరుపతి స్వామి తెలిపారు. ఇందులో 11 మందికి రిఫర్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి ఉప్పాడ అనూష, వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, మాజీ జెడ్‌పిటిసి ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ బైరెడ్డి రాజు, ఎంపిడిఒ అప్పలనాయుడు, ఇఒపిఆర్‌డి సురేష్, ఎంఇఒ రమణమూర్తి, సచివాలయ కన్వీనర్లు పడాల శీను, సుందర హరీష్, గుర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.
విజయనగరం టౌన్ : జగనన్న ఆరోగ్య సురక్ష ఒక బృహత్తర కార్యక్రమమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మండలంలోని జొన్నవలస గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. వివిధ స్టాళ్లను సందర్శించారు. అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష కిట్లను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి మామిడి అప్పలనాయుడు, జెడ్‌పిటిసి సభ్యులు కెల్ల శ్రీనివాసరావు, వైస్ ఎంపిపి కర్రోతు నారాయణ, సర్పంచ్ కంది రమాదేవి, పిఎసిఎస్ చైర్మన్ కెల్ల త్రినాధ్, కంది గణపతి, ఎంపిడిఒ గంటా వెంకటరావు పాల్గొన్నారు. గాజులరేగ పిహెచ్‌సి వద్ద నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కోలగట్ల ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, సహాయ కమిషనర్ ప్రసాదరావు, జోనల్ ఇన్చార్జి డాక్టర్ వి ఎస్ ప్రసాద్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.










