Oct 18,2023 00:32

ప్రజల వద్దకే మెరుగైన వైద్యసేవలు: ఎమ్మెల్యే

ప్రజల వద్దకే మెరుగైన వైద్యసేవలు: ఎమ్మెల్యే
జగనన్న సురక్ష వైద్య పరీక్షలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆరణి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ద్వారా మెరుగైన వైద్యసేవలు ప్రజల చెంతకే అందుతోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 9వ వార్డు సచివాలయంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్‌ ఎస్‌.అముద, డిప్యూటీ మేయర్‌ ఆర్‌.చంద్రశేఖర్‌లు మంగళవారం పరిశీలించారు. ఎమ్మెల్యే వైద్యశిబిరంలో అన్ని కౌంటర్లను పరిశీలించి అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. పలు కౌంటర్ల వద్ద రోగులతో మాట్లాడారు, వారి ఆరోగ్య పరిస్థితిని, అందిన సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్యశిబిరానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్లు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. ఐసిడిఎస్‌, మెప్మా స్టాల్స్‌ను సందర్శించారు. సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, స్థానిక కార్పొరేటర్‌ భాగ్యలక్ష్మి, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ లోకేష్‌, సీఎంఎం గోపి, ఎసీపీ రామకష్ణుడు, వైద్యాధికారులు, నగరపాలక అధికారులు, వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.