Feb 13,2023 21:07

మాట్లాడుతున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు

ప్రజల తరపున పోరాడే వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి
- పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు
- మద్దతుగా ప్రజా సంఘాలు విస్తృత ప్రచారం
ప్రజాశక్తి - బేతంచెర్ల

      ప్రజా సమస్యలపై స్పందించి, పోరాడే వారికి పట్టభుద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు అన్నారు. సోమవారం బేతంచర్లలో వామపక్ష నాయకులు ఎల్లయ్య వైబి వెంకటేశ్వర్లు, డోన్‌ నాయకులు శివరాం, నాగమద్దయ్య రామాంజనేయులుతో కలిసి సరస్వతి డిగ్రీ కళాశాల, వివేకానంద, తదితర కళాశాల పాఠశాలలో పనిచేస్తున్న వారిని కలిసి పిడిఎఫ్‌ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపించాలని ప్రజా సంఘాల నాయకులు విస్త్రుత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పోతుల నాగరాజు మాట్లాడారు. కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు బ్రోకర్‌గా పని చేస్తూ దేశాన్ని ప్రభుత్వ సంస్థలను కట్ట పెట్టాలని ప్రయత్నం జరుగుతుందన్నారు. పెద్దల చట్ట సభలకు పేదల పక్షాన నిలబడి పోరాడే వ్యక్తిని గెలిపించడానికి సహకరించాలన్నారు. డోన్‌ నియోజకవర్గం వామపక్షాల నాయకులు వెంకటేశ్వర్లు, ఎల్లయ్య, శివరాం, రామాంజనేయులు మాట్లాడుతూ కార్మికుల పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకూ పోరాడే వ్యక్తికి పట్టభద్రుల ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క మేధావి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగ మద్దయ్య, ఎస్సే కలాం, బాలయ్య, నరసింహారెడ్డి, రాజబాబు, బాలకృష్ణ, మాలిక్‌ బాష, వెంకట్‌ రాముడు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. బండి ఆత్మకూర్‌ : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యుదయ వాది, ప్రజా నాయకుడు పోతుల నాగరాజును గెలిపించాలని కోరుతూ మండల కేంద్రంలో సిఐటియు నాయకులు రత్నమయ్య, బీసీ నాయకులు రఘురాం ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి పట్టభద్రులను అభ్యర్థించారు. సిఐటియు నాయకులు రాజు, డివైఎఫ్‌ఐ నాయకులు రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు. పాణ్యం : పోతుల నాగరాజుని శాసన మండలి ఎన్నికల్లో గెలిపించా లని ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రచారం నిర్వ హించాయి. పిడిఎఫ్‌ బల పరిచిన అభ్యర్థులను గెలిపిస్తే సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తారని సంఘాల నాయకులు అన్నారు. ప్రజాసంఘాల నాయకులు భాస్కర్‌, వెంకటాద్రి, శివకృష్ణ యాదవ్‌,ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టుబద్రుల శాసన మండలి స్థానాలకు పోటీ చేస్తున్న కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్‌ స్వాములు, సిఐటియు జిల్లా నాయకులు ఏ రణధీర్‌, బి రామ్‌ నాయక్‌, గిరిజన సంఘం జిల్లా నాయకులు నరసింహ నాయక్‌ కోరారు. సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలంలోని దుద్యాల, నందికుంట, కొత్తపల్లి, శివపురం, ముసలమడుగు, గోకవరం పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.