ప్రజల శ్రేయస్సు మాకు ముఖ్యం : చల్లా విగ్నేశ్వర్ రెడ్డి
ప్రజాశక్తి - అవుకు....
అవుకు పట్ట ణంలోని ప్రతి కాలనీని అభివృద్ధి చేసి ప్రజల అభివృద్ధి తమకు ముఖ్యం అని స్వర్గీయ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి పెద్ద కుమారుడు చల్లా విగ్నేశ్వర్ రెడ్డి అన్నారు. గత మూడు రోజుల క్రితం అవుకు పట్టణంలోని ఎస్ఆర్బిసి కాలనీలో ఆయన పర్యటించి కాలనీ వాసుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే సోమవారం కాలనీలో పర్యటించిన ఆయన కాలనీవాసుల తాగునీటి సమస్యను తీర్చేందుకు మూడు లక్షల 50 వేల రూపాయల నగదును కాలనీవాసులకు అందించారు. విద్యుత్ సమస్యను తీర్చడం కోసం విద్యుత్తు స్తంభాలను మార్చేందుకు విద్యుత్ శాఖ వారికి 20 వేల రూపాయల నగదును అందించారు. కాలనీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన 48 గంటల్లోనే కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించిన చల్లా విగ్నేశ్వర్ రెడ్డికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాలనీకి చెందిన లక్ష్మీ బాయి అనే మహిళ మిద్దె పైనుండి కిందపడి వెన్నపూస దెబ్బతిని ఇలాంటి పని చేసుకోలేక ఇంటి వద్దనే ఉన్న మహిళను పరామర్శించి ఆమె సమస్యను అధికార దృష్టికి తీసుకువెళ్లి పెన్షన్ వచ్చేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది, గంగాధర్, సికిందర్, రసూల్ ,షంషీర్ కాలనీవాసులు పాల్గొన్నారు.










