Sep 29,2023 21:31

గ్రామ సచివాలయం

లబోదిబోమంటున్న బాధితులు
నందలూరు : మండలం నాగిరెడ్డిపల్లి మేజర్‌ గ్రామ పంచాయతీలో ప్రజల సొమ్ము గోల్‌మాల్‌ కావడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఎంతో మంది పంచాయతీ కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. కానీ గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి, కీలక ప్రజాప్రతినిధి అర్జీదారుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి వాటాలుగా పంచుకొని నకిలీ అనుమతి పత్రాలు మంజూరు చేయడం ఈ విషయం తెలియని బాధితులు ఆ ధ్రువపత్రాలను బ్యాంకులకు ఇతర ప్రయివేట్‌ సంస్థలకు రుణాల మంజూరు కోసం సమర్పించారు. సదరు పత్రాలను పరిశీలించిన బ్యాంక్‌ అధికారులు ప్రయివేట్‌ సంస్థలు అవి నకిలీవిగా తేల్చడంతో అర్జీదారులు నిశ్చేష్టులైనారు. పంచాయతీలో ఇటీవల స్థల నివేషణ కోసం కొంత మంది వేసిన ప్లాట్లను అమ్ముకోనీయకుండా సవాలక్ష కొర్రీలు పెట్టి అధికారి తోపాటు ప్రజాప్రతినిధులకు లక్షల రూపాయల్లో సొమ్ము అందిన తర్వాత యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకోవడానికి అనుగ్రహించారు. ఈ అక్రమాలపై ప్రశ్నించిన సదరు కొత్త అధికారిని ఆగమేగాలపై బదిలీ చేస్తున్నారు. ఇప్పటికైనా పైఅధికారులు ఈ అవినీతి అక్రమాలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.