Jun 25,2023 23:58

ఎత్తిపోతల పథకం వద్ద మాట్లాడుతున్న అయ్యన్న

ప్రజాశక్తి-వడ్డాది : సంక్షేమం పేరుతో ప్రజలకు చిల్లర పైసాలు ముట్టజెప్పి, ప్రధానమైన సమస్యల పరిష్కారంలో సిఎం జగన్‌, ఎమ్మెల్యే ధర్మశ్రీ, నిర్లక్ష్యం చేశారని మాజీ ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్‌ రాజు మండిపడ్డారు. 'మీ భవిష్యత్‌ మా గ్యారెంటీ' ప్రచారంలో భాగంగా బంగారుమెట్ట ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పథకం ఎప్పటికి పూర్తిచేస్తారంటూ సెల్ఫీ చాలెంజ్‌ చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ టిడిపి హయాంలో 90 శాతం పనులు .జరిగిన ఎత్తిపోతల పథకం ఏవో కారణాలతో ఆగిపోతే, పూర్తిచేసేందుకు నాలుగేళ్లలో ఏంచ ర్యలు చేపట్టారో చెప్పాలని ప్రశ్నించారు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. భీమునిపట్నం నర్సీ పట్నం రోడ్డులోని గుంతలు ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీకి కనిపించడం లేదాయని ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో తుని నుంచి సబ్బవరం వరకు వయా నర్సీపట్నం, చోడవరం మీదుగా జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదించామని, చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో పెండింగ్‌లో ఉన్న ఆఫైల్‌ను పూర్తిచేయాలన్నారు. అనంతరం వడ్డాది చెరుకు కాటా వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వడ్డాది వంతెన పడిపోయి రెండేళ్లవుతున్నా పట్టించుకునే దిక్కులేదని మండిపడ్డారు. దీని వల్ల సుగర్‌ ఫ్యాక్టరీ మూతబడే పరిస్థితి ఉన్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్యబాబు, చింతకాయల అయ్యన్నపాత్రుడు పీలా గోవిందత్యనారాయణ, మాజీ సర్పంచ్‌ తమరన దాసు. యల్లపు జగ్గారావు పాల్గొన్నారు
బుచ్చయ్యపేట : తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారెంటీ బస్సు యాత్ర ఆదివారం బుచ్చయ్యపేట మండలంలోకి ప్రవేశించింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, పార్టీ జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కెఎస్‌ ఎన్‌ ఎస్‌ రాజు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్యబాబు అమరపురి జ్యోతిర్మయి బాబా ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. భోజన విరామం తర్వాత యాత్ర ప్రారంభమైంది.