May 27,2023 22:27

సదస్సులో మాట్లాడుతున్న ఎంపిపి రాయుడు సునీత


ప్రజాశక్తి - తాళ్లరేవు
ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలు నివారణ సాధ్యమని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. ప్రజలందరూ భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. తాళ్ళరేవు మండల పరిషత్‌ లో రోడ్డు ప్రమాదాల నివారణ, చర్యలపై ఎంపిపి రాయుడు సునీత అధ్యక్షతన జరిగిన సదస్సులో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇటీవల తాళ్ళరేవు మండ లంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యు లకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ముందుగా రెండు నిమి షాలు మౌనం పాటించారు. కోరంగి ఎఎస్‌ఐ సత్యనారాయణ, రోడ్‌ సేఫ్టీ ఎఎస్‌ఐ. తిరుమలరావు మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్‌లు, కారులో సీటు బెల్టు ధరించాలని, ఆటోలో ముందు కూర్చుని ప్రయాణం చేయవద్దని తెలిపారు. ప్రమాదాల నివారణ కొరకు చొల్లంగి, గురుజనాపల్లి సెంటర్‌ నుంచి సుంకరపాలెం జంక్షన్‌ వరకు పలుచోట్ల వేగాన్ని నిరోధించే జిగ్‌ జాగ్‌వే ఏర్పాటు చేశామని, సుబ్బారాయుడు దిమ్మ జంక్షన్లో వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు సహకరించాలని కోరారు. ఆర్‌టిసి డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఎవిఎస్‌ నారాయణ మాట్లాడుతూ జాతీయ రహదారి పలుచోట్ల ఆక్రమణలకు గురైనట్లు వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ టేకుమూడి ఈశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు దుప్పి అదష్టదీపుడు, విశ్రాంత ఉద్యోగ సంఘం నాయకులు అత్తిలి బాబురావు మాట్లాడుతూ జాతీయ రహదారి 216లో మలుపులలో ప్రమాద హెచ్చరికలు, వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటుచేయాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నమోదు చేయాలన్నారు. వైస్‌ ఎంపిపి దూళిపూడి నాగేంద్రప్రసాద్‌, జడ్‌పిటిసి దొమ్మేటి సామ్యూల్‌ సాగర్‌, వైసీపీ మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్‌, జడ్‌పి మాజీ చైర్మన్‌ దున్న జనార్దన్‌ రావు, మార్కెటింగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఉంగరాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జంక్షన్‌ లలో రాత్రి వేళల్లో విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని, ఓవర్‌ లోడ్‌తో ప్రయాణించే వాహనాలను నియంత్రించాలన్నారు. సత్య సాయి పబ్లిక్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ పట్టా ఆదినారాయణ వర్మ మాట్లాడుతూ ప్రమాదాల నియంత్రించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని వాటికి తమ వంతు సహకారం అందిస్తానన్నారు. మాట్లాడుతూ ఈ సదస్సులో ఆటో యూని యన్‌ నాయకులు, ఆర్‌అండ్‌బి, ఉపాధి హామీ, వైయస్సార్‌ క్రాంతి పదం, ఐసిడిఎస్‌ తదితర అధికారులు, యువత వినకోటి రామకష్ణ, నేరేడుమిల్లి త్రిమూర్తులు, ఎంపిటిసి రచ్చ ముత్యాలు, ఆటో యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణ - చర్యలకు కమిటీ ఏర్పాటు
రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై తాత్కాలికంగా అధికా రులు, ప్రజా ప్రతి ధులు, ప్రజాసంఘాల నాయకులు 10 మందితో తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేశారు. ఎన్‌.హెచ్‌. ఎఇ మణికంఠకు జాతీయ రహదారి 216పై చేపట్టాల్సిన పనులను గురించి ఎంపిపి రాయుడు సునీత పలు సూచనలు చేసి, త్వరలో కమిటీ బృందం హైవే అధికారులతో ఎన్‌.హెచ్‌. 216 పరిశీలన చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారను.