ప్రజాశక్తి-పాడేరు టౌన్: ప్రజల పక్షాన పోరాడే పత్రిక ప్రజాశక్తి అని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కొనియాడారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు తలారి సింగిలోని తన నివాసంలో ఆదివారం ప్రజాశక్తి క్యాలెండర్-2023ను ఎపి మెడికల్ కౌన్సిల్ మెంబర్ టి.నర్సింగరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాశక్తి పత్రిక కృషిని అభినందించారు. ప్రజా సమస్యలపై మంచి కథనాలను ప్రచురం చేస్తూ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు మధ్య వారధిలా ప్రజాశక్తి పని చేస్తోందన్నారు. క్యాలెండర్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని, ప్రజాశక్తి దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట, పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ కె.సింహాచలం నాయుడు, సిహెచ్.రమాదేవి, ప్రజాశక్తి డిఒ పి.దేముడుబాబు, విలేకరి ఒ.జ్ఞానప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.










