Jan 09,2023 23:54

ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి-నక్కపల్లి:ప్రజల ముంగిటకు సంక్షేమ పథకాలు అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గ్రామస్థాయిలో సచివాలయ వ్యవస్థను తీసుకు వచ్చారని ఎమ్మెల్యే గొల్ల బాబురావు తెలిపారు. మండలంలోని దోసలపాడు గ్రామంలో సోమవారం సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటికి చేరవేస్తున్నారని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఎంపీపీ రత్నం, జడ్పిటిసి కాసులమ్మ, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, ఎంపీడీవో సీతారామరాజు, వైసిపి నాయకులు నరసింహమూర్తి, బొల్లం బాబ్జి, ఎలమంచిలి తాతారావు, చందర్రావు, శేషారత్నం, బాబురావు, పాపారావు పాల్గొన్నారు.