ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. బుధవారం మండలంలో సూడిగాంలో జెఎఎస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే మెరుగైన వైద్య సేవల కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫరల్ సౌకర్యం కూడా ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్ సందర్శించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శివన్నారాయణ, వైద్యాధికారులు తిరుమల ప్రసాద్, ఎంపిపి మజ్జి శోభారాణి, వైస్ ఎంపిపిలు సిద్ధా జగన్నాథరావు, బంకూరు రవికుమార్, సర్పంచ్ పైల సూర్యనారాయణ, ఎండ్రాపు ఉషారాణి, లక్ష్మి, నాయకులు బొమ్మి రమేష్, మజ్జి చంద్రశేఖర్, మిరియాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సీతానగరం : జగనన్న ఆరోగ్య సురక్ష రోగుల పాలిట వరమని ఎమ్మెల్యే అలజింగి జోగారావు తెలిపారు. బుధవారం మండలంలోని లచ్చయ్యపేట, గుమ్మడివరం గ్రామాలకు చెందిన 450 మందికి పైగా రోగులకు వైద్యసేవలు అందించారు. వైద్యశిబిరంలో సీతానగరం, పెదంకలం పిహెచ్‌సిల వైద్యులు శిరీష, ఉషారాణి రాధాకాంత్, ప్రభుతేజ, స్పెషలిస్టు వైద్యులు ప్రసాద్, అపర్ణబాల, పవిత్ర, జగదీష్ తనిఖీలు నిర్వహించారు. మందులు అందజేశారు. 104 సిబ్బంది ప్రసాద్, ఈశ్వర రావు కూడా పాల్గొని సేవలు అందించారు. అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారం స్టాల్ ఏర్పాటు చేశారు. ఐసిడిఎస్ పిఒ సుగుణ, సూపర్‌వైజర్ పూర్ణిమ పాల్గొని దీనివల్ల కలిగే ఉపయోగాలు వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి మామిడి బాబ్జి, వైసిపి నాయకులు బలగ శ్రీరాములు, మండల అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, తహశీల్దార్ ఎన్‌వి రమణ, ఇఒపిఆర్‌డి వర్మ, ఎంఇఒ వెంకటరమణ, సిహెచ్‌ఒ ఎస్‌వి రమణ, హెచ్‌వి భవానీ, హెచ్‌ఎస్ శర్మ, సర్పంచ్ చింతాడ కృష్ణ, ఎంపిటిసి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టం : మండలంలోని రేగులపాడులో ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది రాజకీయ మధ్యవర్తులు, దళారుల ప్రమేయం వల్ల అర్హులైనా సంక్షేమం పథకాలు పొందలేకపోయారని తెలిపారు. ప్రస్తుతం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. అనంతరం వైద్య సేవలు పొందిన రోగులకు మందులు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ ఆధ్వర్యాన ఎమ్మెల్సీని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు, జెడ్‌పిటిసి జంపు కన్నతల్లి ఉమామహేశ్వరరావు, సర్పంచ్ మెరుగుల భవాని, వైస్ ఎంపిపి పర్రి విజయ కుమారి, మండల ప్రత్యేకఅధికారి పి.కిరణ్‌కుమార్, తహశీల్దార్ సిహెచ్ సత్యనారాయణ, చిదిమి, యు.వెంకంపేట సర్పంచులు డి.ఉమామహేశ్వరరావు, ఎస్.లక్ష్మీ సింహాచలం, నాయకులు బి.చంద్రమౌళి, సీనియర్ నాయకులు పి.దవళేశ్వరరావు, పి.సూర్యప్రకాశ్, వైద్యులు నితీశా, తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట : మండలంలో పెద్దూరులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని డిఎంహెచ్‌ఒ బి.జగన్నాథరావు సందర్శించారు. ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్ష వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఒ కె.గీతాంజలి, వైద్యాధికారి భాను ప్రతాప్, ఇఒపిఆర్‌డి అధికారి కొండపల్లి సత్యం, కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు.










