Jul 03,2023 00:13

ప్రజాశక్తి-కాజులూరు ప్రజల ముంగిటికే సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టు బిసి సంక్షేమం శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. ఆదివారం కాజూలూరు మండలం, దుగ్గుదుర్రు గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలసి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ముంగిటకు పరిపాలనను, ప్రభుత్వ సేవలను చేరువచేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను గడప గడపకు వెళ్లి లబ్ధిదారులకు వివరించారు. పథకాలు అందుకుంటున్న వారి సంతప్తి స్థాయిని స్వయంగా తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎం.భారతి మురళి, సర్పంచ్‌ పోతు వెంకట లక్ష్మి, తహశీల్దార్‌ సాయి సత్యనారాయణ, ఎంపిడిఒ రత్న రాజు సహకార సంఘ అధ్యక్షులు రేమెళ్ల చిట్టియ్య దొర, బిసి సెల్‌ కన్వీనర్‌ గుబ్బల యేసు రాజు, స్థానిక నాయకులు పోతు శ్రీనివాస్‌, యాళ్ల సత్తిబాబు, నాయకులు పాల్గొన్నారు.