ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : జగనన్న ఆరోగ్య సురక్షతో పేద ప్రజల ముంగిటకే వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. గురువారం మండలంలోని నర్సిపురం-1లో జెఎఎస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందించి ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తుందని, అవసరమైతే మెరుగైన వైద్య సేవల కోసం నాణ్యమైన ఆసుపత్రులకు రిఫరల్ సౌకర్యం కూడా ఉందని అన్నారు. అనంతరం అంగన్వాడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ అకిబ్ జావేద్, వైద్యాధికారులు డాక్టర్ తిరుమల ప్రసాద్, సర్పంచ్ చెరుకుపల్లి బంగారమ్మ, ఎంపిపి మజ్జి శోభారాణ, వైస్ ఎంపిపిలు సిద్ధా జగన్నాధరావు, బంకూరు రవికుమార్, నాయకులు వెంపల గురురాజు, కాపరపు సత్యనారాయణ, రామస్వామి, భూతాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
సాలూరు: పేదలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టిందని మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ చెప్పారు. గురువారం రామాకాలనీ సచివాలయానికి సంబంధించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ బీసపు హైమ సత్యవతి, కమిషనర్ టి.జయరాం, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ఫకీర్ రాజు, ఆర్ ఐ అహ్మద్ పాల్గొన్నారు.
సాలూరు రూరల్ పేదప్రజల ఆరోగ్య ప్రదాయిని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రెడ్డి పద్మావతి అన్నారు. మండలంలోని పెదపదం సచివాలయం పరిధిలో గురువారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి రెడ్డి సురేష్, వైసిపి మండల అధ్యక్షుడు భరత్ శ్రీనివాసరావు, ఎఎంసి ఛైర్పర్సన్ దండి అనంత కుమారి, ఎంపిడిఒ గొల్లపల్లి పార్వతి, సర్పంచ్ రెడ్డి సుకన్య, వైద్యులు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని గాదెలవలస గ్రామ సచివాలయ పరిధిలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎ.జోగారావు మాట్లాడుతూ జగనన్న సురక్ష శిబిరాల ద్వారా గుర్తించిన రోగులను వైద్యం కోసం ఇతర కార్పొరేటు ఆసుపత్రికి పంపించి లైన్ చేయడం ప్రభుత్వ బాధ్యత వహిస్తుందన్నారు. ఇందులో అన్ని వ్యాధులకు తనిఖీలు చేయబడినన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొన్నాడ అన్నపూర్ణ, వైసిపి నాయకులు బొన్నాడ తిరుపతిరావు, శివకుమార్, ఎంపిపి ప్రతినిధి బి.శ్రీరాములు నాయుడు, జెడ్‌పిటిసి ఎం.బాబ్జి, వైద్యులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మక్కువ : మండల కేంద్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. జెడ్‌పిటిసి సభ్యులు మావుడి శ్రీనివాసనాయుడు, వైసిపి మండల అధ్యక్షులు మావూడి రంగునాయుడు వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన సేవలను పరిశీలించి రోగులకు, వైద్య సిబ్బంది చికిత్స చేసే పని తీరును అడిగి తెలుసుకున్నారు. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సద్వినియోగం చేసుకోండి అని తెలిపారు. కార్యక్రమంలో పిహెచ్‌సి వైద్యాధికారులు హరికృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వైద్య సిబ్బంది, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
భామిని :మండలంలోని బత్తిలిలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సర్పంచి టింగ శాంతి కుమారి ప్రారంభించారు. బత్తిలి పిహెచ్‌సి వైద్యులు డాక్టర్ కొండపల్లి రవీంద్ర, డాక్టర్ దామోదరరావు, డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో 543 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. హెల్త్, న్యూట్రిషన్, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బత్తిలి ఎంపిటిసి సభ్యులు టింగ అన్నాజీరావు, ఎంపిపి ప్రతినిధి తోట సింహాచలం, వైస్ ఎంపిపి బోనగడ్డి ధర్మారావు, ఎంపిడిఒ జి.చంద్రరావు, డిప్యూటీ తహశీల్దార్ శేఖరం, ఎంఇఒ భాస్కరరావు, పంచాయతీ సెక్రటరీ శ్రీను, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కొమరాడ : మండలంలో చినఖేర్జలలో జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్) కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు తనిఖీ చేశారు. ఎంత మందికి వైద్య సేవలు అందజేశారు, సర్వేలో ఇచ్చిన టోకెన్లు, ప్రతి కౌంటర్ వద్ద ప్రజలకు అందజేసిన వైద్య సేవల వివరాలు, ఎటువంటి ఆరోగ్య సమస్యలతో ఎక్కవగా వచ్చారు తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఒపి నమోదు వివరాలు రికార్డులో పరిశీలించారు. పలు ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారిలో ఆయా రోగాల వారీగా ఎంతమంది వైద్య సేవలు వినియోగించున్నారని అడిగారు. ఆరోగ్య తనిఖీల్లో కొత్తగా గుర్తించిన బిపి, మధుమేహం, రక్తహీనత గల కిశోర బాలికలు, కఫం పరీక్షల ద్వారా కొత్తగా నమోదైన క్షయ వ్యాధి గ్రస్తులు, కళ్ల తనిఖీలకు వచ్చిన వారిలో కేటరాక్ట్ ఆపరేషన్లకు ఎంత మందిని గుర్తించారు, కళ్ల జోళ్లు ఎంతమందికి అవసరమయ్యాయి, రిఫరల్ అవసరమైన వారిని పర్యవేక్షణ, కొత్తగా గుర్తించిన లెప్రసీ లక్షణాలు ఉన్నవారు, పిల్లలు, గర్భిణీలో ఎంతమందికి పోషకాహార లోపం, హై రిస్క్ ఉన్నవారిని గుర్తించారు అడిగి రికార్డులో పరిశీలించారు. కొత్తగా గుర్తించిన అసాంక్రమిక వ్యాధులున్న వారిని పర్యవేక్షించాలన్నారు. అనంతరం అంగన్వాడీ స్టాల్‌ను పరిశీలించి ఎంతమంది గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారని ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎం. మల్లికార్జునరావు, వైద్యాధికారి సిహెచ్.అరుణ్ కుమార్, సర్పంచ్ హెచ్.గంగారావు, వైస్ సర్పంచ్ పి.ప్రసాద్, స్పెషలిస్ట్ వైద్యులు, పంచాయతీ సెక్రటరీ టి.వెంకటరమణ, సూపర్ వైజర్లు విజయకుమారి, జయగౌడ్ వైద్య, సచివాలయ, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.










