కడప అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముంగిటకు పాలన తీసుకువచ్చిందని జిలా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పురపాలక పట్టణాభివద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మంగళవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రజలకు సందేశం ఇస్తూ గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు సేవలు సకాలంలో అందుతున్నాయని పేర్కొన్నారు. స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. జిల్లాలో పరిశ్రమల అభివద్ధికి కషి చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక మౌలిక వసతులు, సదుపాయాల కల్పనలో శ్రద్ధ వహి స్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పని కల్పిస్తున్నామని చెప్పారు. రాజాధికా అమత్ మహో త్సవంలో భాగంగా ఉపాధి హామీ, వాటర్ షెడ్ డెవల ప్మెంట్, నీటిపారుదల అటవీ శాఖ ద్వారా జిల్లాలో 91 చెరువులను పునరుద్ధరించడం ద్వారా వైఎస్‌ఆర్ జిల్లా రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉందని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కాపు నేస్తం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన మహిళల ఆర్థిక అభివద్ధికి చేయూతనిస్తున్నామని తెలిపారు. జిల్లాలో సొంత మగ్గమున్న చేనేత కుటుంబానికి రూ.24వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. వైఎస్‌ఆర్ వాహన మిత్ర ద్వారా డ్రైవర్ కం ఓనర్ కు రూ. పదివేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీల అభివద్ధికి నాడు- నేడు ఫేస్- 2 లో భాగంగా కడప నగరపాలక సంస్థ పరిధిలో 89 స్కూల్స్ ఎంపిక చేశామని పేర్కొన్నారు. పనులు కొనసా గుతున్నాయని తెలిపారు. పబ్లిక్ టాయిలెట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని చెప్పారు. పాడా నిధులతో పులివెందులను అభివద్ధి చేస్తున్నామన్నారు. ప్రాజెక్టులలో నీటి నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులకు అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వైయస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భవతులకు, బాలింతలకు, చిన్నారులకు పోషక విలువలతో కూడిన పౌష్టిక ఆహార కిట్టును అందజేస్తున్నామని చెప్పారు. వైయ స్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా బాల్య వివాహాలను అరికట్టేందుకు చదు వును ప్రోత్సహించేందుకు పదవ తరగతి నిబంధన అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించేందుకు శక్తివంచన లేకుండా కషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అనుబురాజన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.










