ప్రజాశక్తి - కోసిగి
రాష్ట్రంలో ప్రజల మద్దతుతో 2024 ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి గెలుస్తారని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కోసిగి 4వ సచివాలయంలో 'ఎపికి జగనే ఎందుకు కావాలి' నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హాజరయ్యారు. ముందుగా నవరత్నాల పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాల పట్టిక (డిస్ ప్లే)ను ఆవిష్కరించారు. అనంతరం వైసిపి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. 2014 చంద్రబాబు హామీల పాలన, 2019 జగనన్న హామీల పాలనలోని వ్యత్యాసాన్ని ప్రతి గడపకూ వివరించాలని తెలిపారు. మళ్లీ రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలో ప్రజలకు తెలియజేయాలని కోరారు. మండల జెసిఎస్ ఇన్‌ఛార్జీ పి.మురళీమోహన్ రెడ్డి, వైసిపి మండల అధ్యక్షులు బెట్టనగౌడ్ పాల్గొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంఎస్ నగర్ సచివాలయం-23లో 'ఎపికి జగనే ఎందుకు కావాలి' నిర్వహించారు. ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి హాజరయి వైసిపి జెండాను, సంక్షేమ పథకాల డిస్ ప్లే బోర్డును ఆవిష్కరించారు. మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ రఘు, వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్, కమిషనర్ గంగిరెడ్డి పాల్గొన్నారు. దేవనకొండ మండలంలోని కరివేముల గ్రామంలో సర్పంచి రంగమ్మ, వైసిపి నాయకులు ఎల్‌కె.శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు 'ఎపికి జగనే ఎందుకు కావాలి' నిర్వహించారు. ముందుగా గ్రామ సచివాలయంలో సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎంపిటిసి రంగమ్మ, వైసిపి మండల కన్వీనర్ మల్లికార్జున, లుముంబా, తెర్నేకల్ సర్పంచి అరుణ్ కుమార్, వైసిపి నాయకులు దివాకర్ నాయుడు, రాజారెడ్డి, నారాయణరెడ్డి, వీరేష్, రాఘవేంద్ర పాల్గొన్నారు. మంత్రాలయం మండలంలోని చిలుకలడోన గ్రామ సచివాలయం వద్ద నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి, వైసిపి జెండాను ఆవిష్కరించారు. వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడారు. చిలుకలడోన గ్రామానికి ప్రభుత్వం నుంచి సుమారు రూ.27.85 కోట్ల లబ్ధి చేకూరినట్లు తెలిపారు. సర్పంచి గుజ్జల నాగమ్మ, ఎంపిటిసి ఆకుల లక్ష్మి, కలుదేవకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ అధ్యక్షులు వెంకటరెడ్డి, నాయకులు గుజ్జల హనుమంతు, ఆకుల ఆంజనేయులు, వీరేష్ రెడ్డి, అశ్వత్థామ రెడ్డి, కాంతా రెడ్డి, డీలర్లు వెంకటేష్, రాగన్న పాల్గొన్నారు.