Nov 27,2022 21:22

ప్రజాశక్తి - కలిదిండి
         సినీ నటుడు కృష్ణ బౌతికంగా మన మధ్య లేనప్పటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని సర్పంచి మహాదేవ విజయబాబు అన్నారు. మండలంలోని మూలలంక పంచాయతీ కార్యాలయం వద్ద కృష్ణ సంస్మరణ సభ జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణ నటించిన చిత్రాలు వినోదం కోసమే కాక అణగారిన ప్రజల జనోద్ధరణకు సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాయని అభిమాన సంఘ నాయకులు కొనియాడారు. సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అభిమాన సంఘ నాయకులు బోళ్ల ఏడుకొండలు, ఎడ్ల కృష్ణ, సిరిపురపు సత్యన్నారాయణ, శ్రీనివాస్‌, మామిడిశెట్టి నారాయణ, కుడిపూడి బ్రహ్మం, ముద్దం బుల్లి వెంకయ్య, ఎంపిటిసి రావాడి బాలు, అభిమానులు పాల్గొన్నారు.